March 15, 2025
SGSTV NEWS
Spiritual

షోడశోపచారాలు అంటే ఏంటి..నిత్యం పూజలో భాగంగా ఇవన్నీ అనుసరించాలా!


Nitya Pooja Vidhanam: షోడశోపచారాలు అంటే ఏంటి..నిత్యం పూజలో భాగంగా ఇవన్నీ అనుసరించాలా!


Daily Pooja Procedure In Telugu: నిత్య పూజలో అయినా..ప్రత్యేక పూజల్లో అయినా షోడ సోపచారాలు అనుసరించాలి అని చెబుతుంటారు. ఇంతకీ షోడ సోపచారాలు అంటే ఏంటి? అవేంటి? పూర్తి వివరాలు మీకోసం..




16 step worship Shodashopchar Puja:  నిత్యం ఇంట్లో పూజ చేసేవారు కొందరు.. పండుగలు, ప్రత్యేక సమయంలో పూజ చేసేవారు మరికొందరు. ఎప్పుడైనా కానీ భగవంతుడి పూజలో భాగంగా 16 ఉపచారాలు చేయాలి. ఆ 16 ఉపచారాలనే షోడసోపచారాలు అంటారు. మనసు, శరీరం, ఆత్మను భగవంతుడికి అనుసంధానం చేసి ఆధ్యాత్మికంగా నిర్వహించే ప్రక్రియే పూజ.



పూజల కోసం నిత్యం గంటల సేపు సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. రోజుకి కనీసం 15 నుంచి 20 నిముషాలు మాత్రమే తీసుకుని పూర్తి శ్రద్ధతో భగవంతుడి సన్నిధిలో గడిపితే చాలు..ప్రశాంతత దొరుకుతుంది


పూజలో భాగంగా చేయాల్సిన 16 ఉపచారాలు


మొదటి ఉపచారం ధ్యానం
దీపం వెలిగించిన తర్వాత పూజ ప్రారంభానికి ముందు మనసుని శాంతియుతంగా మార్చుతూ భగవంతుడి రూపాన్ని, శక్తిని ధ్యానించడం


రెండో ఉపచారం ఆవాహనం
పూజలో భాగంగా భగవంతుడికి మనింట్లోకి స్వాగతం పలకడమే ఆవాహానం. పూజ చేస్తున్న స్థలంలోకి ఆహ్వానించడమే..


మూడో ఉపచారం ఆసనం
ఇంట్లో పూజా మందిరంలోకి ఆహ్వానించిన భగవంతుడికి కూర్చునేందుకు ఆసనం సమర్పించడం…ఆయన కూర్చునే చోటు చూపించడం.

నాలుగో ఉపచారం పాద్యం
ఇంటికి వచ్చిన భగవంతుడి కాళ్లు కడగడం.. పాదాలు శుభ్రం చేసే ప్రక్రియే పాద్యం సమర్పయామి అని ఉద్ధరిణతో నీళ్లు సమర్పిస్తారు.


ఐదో ఉపచారం అర్ఘ్యం
కాళ్లు శుభ్రం చేసుకున్న తర్వాత చేతులు కడుక్కునేందుకు నీళ్లివ్వాలి..అది కూడా  ఉద్ధరిణెతో కానీ కలశంలో ఉండే పూవుతో కానీ సమర్పిస్తారు


ఆరో ఉపచారం ఆచమనీయం
ఇంటికొచ్చిన అతిథికి మంచి నీళ్లు ఇస్తాం కదా తాగేందుకు..అదే భగవంతుడికి సమర్పిస్తే ఆచమనీయం అవుతుంది. అది కూడా ఉద్ధరిణెతో కానీ కలశం ఉండే పూవుతో కాని ఇస్తే సరిపోతుంది

ఏడో ఉపచారం స్నానం
స్నానం నిమత్తం కూడా నీళ్లు సమర్పిస్తే సరిపోతుంది


ఎనిమిదో ఉపచారం వస్త్రం
స్నానం అనంతరం నూతన వస్త్రం సమర్పించే ఉపచారం ఇది.. వస్త్రం అంటే అమ్మవారికి అయితే చీర , రవిక…అయ్యవారికి అయితే పంచె ఉత్తరీయం ఇస్తారు. నిత్య పూజలో భాగంగా అయితే పత్తితో తయారు చేసిన చిన్న వస్త్రాన్ని సమర్పిస్తారు



తొమ్మిదో ఉపచారం యజ్ఞోపవీతం
వచ్చే దారిలో మైలపడిన యజ్ఞోపవీతం మార్చుకునేందుకు సమర్పిస్తారు. పత్తితో దారంలా చేసి సమర్పిస్తారు.


పదో ఉపవీతం గంధం – గంధం సమర్పించాలి


పదకొండో ఉపవీతం పుష్పం – పూలు సమర్పించాలి
 
పన్నెండో ఉపవీతం ధూపం – అగరొత్తులు వెలిగించాలి


పదమూడో ఉపవీతం – దీపం.. దీపాన్ని చూపించి నమస్కరించాలి

పద్నాలుగో ఉపవీతం నైవేద్యం
ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం పెట్టాలి కదా.. అదే నివేదన. భగవంతుడికోసం సిద్ధం చేసిన వంటకాలన్నీ నైవేద్యం సమర్పిస్తాం. నిత్య పూజలో భాగంగా వంటకాలు సిద్ధం చేయలేరు కాబట్టి పండ్లు, బెల్లం నివేదిస్తారు


పదిహేనో ఉపచారం తాంబూలం
భోజనం తర్వాత సమర్పించేది తాంబూలం. నైవేద్యానంతరం తాంబూలం సమర్పయామి అని ఆకు వక్క సమర్పిస్తారు

పదహారో ఉపచారం నీరాజనం
భగవంతుడి రూపానికి ప్రతిరూపంగా సమర్పించేదే నీరాజనం..

ఉపచారాలు పూర్తిచేసిన తర్వాత మంత్రపుష్పం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం, క్షమాపణతో పూజ పూర్తవుతుంది.

ఇంటికి చ్చే అతిథిని ఎలా గౌరవించాలని పెద్దలు చెప్పారో.. అలా భగవంతుడిని ఆహ్వానించి గౌరవించడమే షోడసోపచారాలు…


నిత్యపూజలో షోడశోపచారాలు చేయాలా అంటే..అది మీకున్న సమయం , భక్తిపై ఆధారపడి ఉంటుంది. అవకాశం ఉంటే షోడశోపచారాలు చేస్తే మంచిదే లేదంటే ప్రధానమైనవి దీపం, ధూపం, నైవేద్యం, తాంబూరం, నిరాజనం..ఇవి సమర్పించినా సరిపోతుంది…

ఉపచారాలు, విధానం కన్నా భక్తి ప్రధానం అని గుర్తుంచుకోవాలి….

Related posts

Share via