SGSTV NEWS
Crime

వామ్మో.. ఫోన్ వాడొద్దన్న తల్లి.. కూతురు ఏం చేసిందో తెలిస్తే షాకే..



ఇంట్లో జరిగిన చిన్న గొడవ విషాదంగా మారింది. 17 ఏళ్ల విద్యార్థిని కోపంతో తన తల్లిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం తీవ్ర గాయాలపాలైన తల్లిని ఆసుపత్రికి తరలించారు. చిన్న కారణాలకే హింసకు పాల్పడుతున్న ప్రస్తుత సామాజిక పోకడలకు ఈ ఘటన అద్దం పడుతోంది.


సమాజంలో జరిగే కొన్ని ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే కొంతమంది ప్రాణాలు తీస్తున్నారు. లవర్ కోసం తల్లిని చంపడం, గేమ్ ఆడొద్దని చెప్పినందుకు చంపడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటనే జరిగింది. మొబైల్ ఫోన్ వాడకంపై ఇంట్లో జరిగిన చిన్న గొడవ పెద్ద విషాదానికి దారితీసింది. కేరళలోని అలప్పుళలో కేవలం 17 ఏళ్ల విద్యార్థిని తన తల్లిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచింది.

అసలేం జరిగింది..?
వడక్కల్‌లోని కూతురు మొబైల్ ఫోన్ వాడుతుండగా.. తల్లి ప్రశ్నించింది. ఈ విషయంలో మాట మాట పెరిగడంతో బాలిక కోపం పట్టలేకపోయింది. దీంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని తల్లిపై దాడి చేసింది. దాడిలో ఆ తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన తల్లిని వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.

బాధితురాలి పరిస్థితి
పోలీసులు తల్లి స్టేట్ మెంట్ ఆధారంగా ఆ అమ్మాయిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ చిన్న గొడవ ఇంత దూరం వెళ్లడం స్థానికులను షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలం చాలా కీలకమని తెలిపారు

Also read

 

Related posts