ఐ.యఫ్.టి.యు నిడదవోలు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిడదవోలు పంగిడిరోడ్ లోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలు నందు నిర్వహించిన రాజకీయ తరగతుల 2 వ సెషన్ లో సమసమాజ స్ధాపన అంశంపై వక్త గా విచ్చేసిన ఐ.యఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ఎంత మంది పాలకులు మారినా , స్వాతంత్ర్యం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా సమాజంలోని అసమానతలు రోజురోజుకూ పెరుగుతున్నాయనీ, శ్రామికులు మరింత పేదలు గా మారుతున్నారనీ, మొత్తం సంపద ను కొద్ది మంది తమ గుప్పిట్లో పెట్టుకొని దోపిడీ కొనసాగిస్తున్నారని, పాలకులు కొద్దిమంది ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైన పాలనా విధానాలు అవలంబిస్తున్న నేపధ్యంలో ప్రపంచంలో శ్రామిక రాజ్యాలు స్ధాపించి తమ దేశ ప్రజలనే కాక మొత్తం ప్రపంచ దేశాల ప్రజలను ఫాసిస్టు నియంతల కబంధ హస్తాలనుంచి కాపాడగలిగిన మార్క్స్, లెనిన్, మావో మహోపాధ్యాయులు చూపిన మార్గంలో నూతన ప్రజాస్వామిక విప్లవ పంధానే శ్రామిక వర్గ దోపిడీ నివారణకు, సమాజంలోని అసమానతలు రూపు మాటే మార్గం అనీ అన్నారు.
పై తరగతులకు ఇఫ్టూ జిల్లా నాయకులు పామర్తి సత్య నారాయణ, పాతకోకల నాగేశ్వరరావు, తీపర్తి వీర్రాజు, ఈమని గ్రీష్మ కుమార్, అధ్యక్షత వర్గం గా వ్యవహరించారు. గాలి గని రాజు, కోదాటి శివ, యస్.కె. అహ్మద్ ఆలి, బవిరిశెట్టినాగేంద్ర, అడబాల రమణ, బంకపల్లి నాగేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు.
Also read :మధ్యాహ్నం బడి భోజన పథకానికి “డొక్కా సీతమ్మ” పేరు పెట్టడం పై “బ్రాహ్మణ సమాజం” హర్షం…
Kothagudem: ‘నేను లేకపోతే అమ్మనెవరు చూసుకుంటారు..’ తల్లిని చంపి ఆపై ఆత్మహత్య
TCyber Crime: సీబీఐ అధికారులమంటూ మహిళకు రూ.26లక్షలు టోకరా..
తెలంగాణలో మరో భారీ స్కాం.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కేసు!