November 21, 2024
SGSTV NEWS
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 8 వ అధ్యాయం – పురాణ..ప్రారంభం – 8

*పురాణ ప్రారంభం – 8*

దితి’కి హిరణ్యాక్షుడు, హిరణ్య కశ్యపుడు, వజ్రకుడు అనే పుత్రులు కలిగారు. తామసికమైన రాక్షస లక్షణాలు కలిగిన వ్యక్తిత్వాలు వాళ్ళవి. ‘దితి’ పుత్రులైన కారణంగా వాళ్ళు ‘దైత్యులు’గా వ్యవహరించబడ్డారు.

‘దను’ అనే కశ్యపత్నికి మయుడు, విప్రచిత్తి, శంబరుడు, నముచి, పులోముడు, అసిలోముడు, విరూపాక్షుడు మొదలైన రాక్షసులు కలిగారు. దను పుత్రులైనందువల్ల వీళ్ళు ‘దానవులు’ అనబడ్డారు.

‘అనాయువు’ అనే పత్నికి విక్షరుడు, బలుడు, వీరుడు . వృత్రాసురుడు అనే రాక్షసులు జన్మించారు. ‘కాల’కు వినాశకుడు, క్రోధుడు అనే రాక్షసులు, కాలకేయులు పుట్టారు
‘ముని’ అనే కశ్యప పత్నికి భీమసేనుడు, ఉగ్రసేనుడు మొదలైన గాంధర్వ పుత్రులు కలిగారు. వీళ్ళంతా దేవగంధర్వులు.

ప్రాధ అనే పత్నికి కూడా దేవ గంధర్వ సంతతి కలిగింది. ‘క్రోధ’కు క్రోధవశులు, ‘క్రూర’కు సుచంద్రుడు, హంతుడు, చంద్రుడు కలిగారు. ఇతర పత్నులకు పక్షులు, జంతువులు కశ్యప సంతతిగా జన్మించాయి.

దేవ లక్షణాలు కలిగిన అదితి పుత్రులకూ, రాక్షస లక్షణాలున్న దితి, దను, అనాయు పుత్రులకూ, రాక్షస లక్షణాలతో జన్మించిన ఇతర కశ్యప పత్నుల పుత్రులకూ ద్వేష

శ్రీ గురు దత్తా

సేకరణ.. ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via