June 29, 2024
SGSTV NEWS
Navagraha Purana

నవగ్రహ పురాణం – 50 వ అధ్యాయం
శనిగ్రహ జననం – 1


మందిరంలో నిశ్శబ్దం తాండవిస్తోంది. వైవస్వతుడూ, యముడూ, యమీ పడుకున్నట్టున్నారు. సూర్యుడు తన శయనాగారం వైపు అడుగులు వేశాడు.

సంతానం ముందు నిలబడి ఆకాశంలోకి చూస్తోంది. ఆమె పైట – ఆమె అందానికి కట్టిన పతాకంలా గాలిలో చలిస్తోంది. సూర్యుడు భార్యను సంతృప్తిగా చూస్తూ సమీపించి, వెనుకవైపు దగ్గరగా నిలుచున్నాడు. సంజ్ఞ భుజాల మీద రెండు చేతుల్నీ వేశాడు.

ఎందుకో సంజ్ఞ ఉలిక్కిపడింది. ఏదో దెబ్బ తగిలినట్టు ప్రతిస్పందిస్తూ తటాలున దూరంగా జరిగి, సూర్యుడి వైపు తిరిగింది. ఆమె ముఖంలో చిరునవ్వే లేదు. చూపులు పక్కకు తిరిగాయి.

*”సంజ్ఞా… భయపడ్డావా ?”* సూర్యుడి కంఠంలో అనురాగం పలికింది.

సంజ్ఞా… భయపడ్డావా ?”” సూర్యుడి కంఠంలో అనురాగం పలికింది.

*”భయపడుతున్నాను…”” అంది సంజ్ఞ.

*”ఏం జరిగింది ? ఎందుకు భయం ? ఎవర్ని చూసి, దేన్ని చూసి భయపడుతున్నావు. దేవీ ?”* సూర్యుడు ఆందోళనతో అడిగాడు. ధైర్యం చెపుతున్నట్టు ఆయన శరీరం ఆమె దగ్గరగా జరిగింది.

సంజ్ఞ కళ్ళకి చేతిని అడ్డం పెట్టుకుంటూ, దూరంగా జరిగింది. *”ఎవర్ని చూసి భయపడుతున్నానో చెప్పనా ?”” అంది మెల్లగా.

*”చెప్పు ! వాడు ఎవడైనా సరే… నిన్ను భయ పెట్టినందుకు…”” సూర్యుడు ఆవేశంతో చెప్పుకు పోతున్నాడు.

*”ముందు – వినండి !”* సంజ్ఞ ఆయనను వారిస్తూ అంది. “నేను భయపడుతోంది మిమ్మల్ని చూసే !”*

*”సంజ్ఞా !”* సూర్యుడు ఆశ్చర్యంతో అరిచాడు.

*”ఔను ! మిమ్మల్ని చూడగానే నా శరీరం వణికిపోతోంది…”*

*”సంజ్ఞా !”” అంటూ సూర్యుడు ఆమె దగ్గరగా జరిగాడు.

*”దయచేసి దూరంగా ఉండండి !”” అంటూ సంజ్ఞ ఎడంగా జరిగింది. నివ్వెరపోయి చూస్తున్న భర్తతో ఇలా అంది. “నిజం చెప్తున్నాను. మన్నించండి ! మీ శరీరం వెదజల్లే కాంతినీ, వేడిమినీ భరించలేకుండా …”*

సూర్యుడు తాత్కాలికంగా మూగవాడైపోయాడు. నమ్మలేనట్టు సంజ్ఞ వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు.

సంజ్ఞ అరచేతిని కళ్ళకు అడ్డంగా ఉంచుకునే ఉంది.

*”సంజ్ఞా ! పరిహాసానికా ఇది !”* సూర్యుడు ఆశగా అడిగాడు. “”అపరాధం చేశానా ? నొప్పించానా ? ఇది…ఇది… ప్రణయ కోపమా, దేవీ ?”*

*”ప్రణయ కోపం కాదు, ప్రణయ శాపం !”* సంజ్ఞ కంఠంలో ఆవేదన ధ్వనించింది. ‘” మన్నించండి ! నేను నిజమే చెప్తున్నాను. మీ శరీరం ప్రసరించే కళ్ళు చెదిరే కాంతినీ, మీ శరీరం వెదజల్లే చెమటలు పట్టించే వేడిమినీ భరించడం ఇక నా వల్ల కాదు…”*

సూర్యుడు దెబ్బతిన్నట్టు చూశాడు. *”అయితే ఇంతకాలం ఎలా భరించావు ?”*

*”భరించాను… భరించక చేయగలిగింది ఏముంది ? అపార్థం చేసుకోకండి ! మీ సామీప్యంలో నేను… చిత్రహింస అనుభవిస్తున్నాను… దయచేసి దూరంగా జరగండి”” సంజ్ఞ తనే దూరంగా జరుగుతూ అంది.

ఆశ్చర్యం నుండి కోలుకున్న సూర్యుడు చిన్నగా నవ్వాడు. “గతం మరిచావా, సంజ్ఞా ? నా వెచ్చదనం నీకు ఎంతో ఇష్టం అంటూ ఆనాడు…”*

**అది ఆనాడు ! మన దేహాల ఐక్యత ప్రారంభమవుతున్న ప్రాథమిక క్షణాలు. ఆ ఆకర్షణ వేరు, ఆ ఆవేశం వేరు. ఉరకలెత్తే ఉత్సాహం మనలోని ఆధిక్యతలనూ, న్యూనతలనూ గుర్తించనివ్వలేదు !”*

*”నీ ధోరణితో, అర్థం లేని భయంతో నన్ను – నీ పతిదేవుణ్ణి అస్పృశ్యుడు నీ చూస్తున్నావు సంజ్ఞా !”*

*”స్వామీ ! అలా అనకండి. నా కోసం… ఒక పని చేయండి… చేస్తారా ?”*

*” !”*

“నా కోసం…మీ వెలుగునూ, వేడిమినీ తగ్గించుకోండి !”*

*”అసంభవం !”* సూర్యుడు వెంటనే అన్నాడు.

*”స్వామీ !”* సంజ్ఞ ఆశ్చర్యంతో అంది. “”నేను మీ అర్ధాంగిని, ప్రేయసిని ! మీ మాటల్లో చెప్పాలంటే మీ సర్వస్వాన్ని. నా మాటల్లో చెప్పాలంటే – నా సర్వస్వాన్నీ మీ సర్వస్వంగా మార్చిన మీ ప్రణయదాసిని !”” సంజ్ఞ ఆవేశంగా అంది.

*”ఔను ! నువ్వు చెప్పినవన్నీ నాకు కూడా వర్తిస్తాయి సంజ్ఞా ! కానీ…నీ కోరిక తీర్చలేను. నా ప్రకాశాన్నీ, ప్రతాపాన్నీ తగ్గించడం అసాధ్యం !”*

*” !”*

*”ఔను సంజ్ఞ… నీ శరీరకాంతినీ, ఉష్ణాన్నీ నువ్వు మార్చుకోలేవు. నేను కూడా అంతే ! గతంలోలాగా ఆవేశాన్ని, ఆకర్షణనూ కవచాలుగా చేసుకుని, నువ్వు సర్దుకుపోవాల్సిందే : భరించాల్సిందే !”*

సంజ్ఞ అయోమయంగా ఆందోళనగా చూసింది.

స్వామి

ఆలోచించు, సంజ్ఞా ! జన్మతో సంక్రమించిన శరీర ధర్మాన్ని గౌరవించాల్సిందే. ఆలోచించు ! నిన్ను నువ్వు సిద్ధపరుచుకో ! భర్త దేహధర్మాన్ని భరించే శక్తిని కూడదీసుకొని, నువ్వే నన్ను సమీపించాలి సుమా ! అప్పటి దాకా నా ప్రతాపం, నా ప్రకాశం నీకు దూరంగానే ఉంటాయి !”* ధైర్యం చెప్తున్నట్టు నవ్వుతూ, సూర్యుడు శయ్యా మందిరం లోంచి అవతలకి నడిచాడు.

సంజ్ఞ బలహీనంగా కూర్చుంది.

స్వామి

సంజ్ఞ పిలుపు విని, సూర్యుడు వెనుదిరిగి ఆమె వైపు చూశాడు.

*”నన్ను… ఆలోచించమన్నారు. నన్ను… సన్నద్ధం చేసుకోమన్నారు. నేను… నేను.. మీ దగ్గరగా ఉంటూ మీకు దూరంగా ఉండలేను…”*

*”సంజ్ఞా…” సూర్యుడి కంఠంలో ప్రేమావేశం పలికింది. *”నా పుట్టినింటికి వెళ్తాను. కొంత కాలం మీకు దూరంగా, దూరంగా ఉండి, నను నేను సిద్ధం చేసుకొని తిరిగి వస్తాను. అనుమతిస్తారా ?”*

సూర్యుడి ముఖం మీద చిరునవ్వు వెలిగింది. *”దూరంగా వెళ్ళి, నాకు దగ్గరయే నీ రాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను సంజ్ఞా ! వెళ్ళిరా!””

*”నేను తిరిగి వచ్చేదాకా వైవస్వతుడినీ, యముడినీ యమినీ మీరే చూసుకోవాలి సంజ్ఞ అభ్యర్థిస్తూ అంది.

*”అలాగే సంజ్ఞా ! చూసుకుంటాను. నీ జన్మస్థల ప్రవాసం త్వరగా పూర్తి చేయ సుమా !”* సూర్యుడు నవ్వాడు. సంజ్ఞ కూడా నవ్వింది.

సకల నవగ్రహ దేవతాయే నమః

Related posts

Share via