July 3, 2024
SGSTV NEWS
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 36 వ అధ్యాయం* *శుక్రగ్రహ జననం – 3*


శుక్రగ్రహ జననం – 3*

‘”బుద్ధికి బృహస్పతి’ అనే మాటను త్వరలో మనం వింటాం ! అసాధారణ జ్ఞానం అతగాడి సొంతం సుమా !”” నారదుడు అన్నాడు. *”ఊ… చూస్తుంటే – ఆ బృహస్పతిని ఇంద్రసభలో నువ్వే ప్రతిష్ఠించినట్లు తోస్తోంది. నారదా !”” వృషపర్వుడు వాలుగా చూస్తూ అన్నాడు. “నారాయణ ! పసిగట్టడంలో ఎవరైనా మీ అసురుల తరువాతే సుమా !”* నారదుడు

నవ్వాడు.

*”నువ్వు సురపక్షపాతివి కాకపోతే, ఆ బృహస్పతిని ఇక్కడ నిలిపి వుండే వాడివి నారదా ?” వృషపర్వుడు ఉక్రోషంతో అన్నాడు.

*”నారాయణ! నువ్వెవరు ? నేనెవరు ? వీరి తండ్రి కశ్యప ప్రజాపతి. ఆయన తండ్రి మరీచి మహర్షి. ఆయన బ్రహ్మగారి మానసపుత్రుడు. నీకు తాతగారు. నేనెవరు ! బ్రహ్మగారి మరొక మానసపుత్రుడ్ని, నీ పితామహుడు మరీచికి సోదరుణ్ని. ఆ సుర బృందమూ, మీ అసుర బృందమూ అక్కచెళ్లెళ్ల బిడ్డలు, సోదరులు. కాకపోతే దాయాదులు. నాకు మీరూ, మీరూ అందరూ ఒక్కటే ! ఈ నారదుడికి పక్షమూ లేదు ; పాతమూ లేదు !”*

“మాటలలో, పాటలలో నీ నైపుణ్యం చాలా గొప్పది నారదా !”” వృషపర్వుడు నవ్వుతూ అన్నాడు. *“సరే ! నేను సురపక్షపాతిని కాను, అని నిరూపించడానికే వచ్చాను. అక్కడ ఒక గురువు వున్నట్లు ఇక్కడ ఒక ‘సద్గురువు’ వుండాలన్న ఆలోచన నాది…”

‘”అందుకేగా ఆ బృహస్పతిని ముందుగా ఆ ఇంద్రుడి పరం చేశావు !”* వృషపర్వుడు కసిగా అన్నాడు.

*”నారాయణ ! ఆ బృహస్పతిని మరిచిపో, వృషపర్వా ! ఆలోచనలో, ఆచరణలో, వ్యూహ రచనలో – ఆ బృహస్పతిని మించిన మహామేధావిని మీ కోసం ప్రత్యేకించి వుంచాను. అంకుశం లాంటి నిశితమైన బుద్ధి ! నిరంకుశమైన వైఖరి ! ముఖ్యంగా జాగ్రత్తగా విను – ముఖ్యంగా అసుర సంతతి పట్ల సానుభూతి. ఇన్ని అద్భుత లక్షణాలున్న…”

*”ఎవరావ్యక్తి!”*

వృషపర్వుడు నారదుడి వాక్ ప్రవాహానికి ప్రశ్నతో అడ్డుకట్ట వేశాడు.

“బ్రహ్మ మానస పుత్రశ్రేష్ఠుడు భృగుమహర్షి తెలుసు కదా ! ఆయన మీ అసుర సంతతికి చెందిన పులోమను పత్నిగా స్వీకరించాడు….””

*”ఈ విషయాలు మాకు ఎరుకేలే, నారదా !””

వృషపర్వుడు అడ్డు తగిలాడు.

*”ఆ దంపతుల పంచమ పుత్రుడు – ‘ఉశనుడు’.. మహామేధావి. ఇటీవలే విద్యాభ్యాసం ముగించాడు. ముఖ్యంగా ఉశనడు, ఆ బృహస్పతికి దీటైన వాడు. సమ ఉజ్జీ ! నిజం చెప్పుకోవాలంటే – బృహస్పతి కంటే – రెండాకులు ఎక్కువే చదివాడు. ప్రధానంగా మనకు అనుకూలించే అంశమేమిటంటే – తల్లి పులోమ ఉశనుడికి ఆ సుర పక్షపాతాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోసింది. ఆ ఉశనుడు ఏ తపో దీక్షలోనో పూర్తిగా మునిగిపోక ముందే… పట్టుకోవడం మంచిదని నా సూచన !”*

*”మా సూత్రధారిగా వ్యవహరించి, కార్యం సానుకూలం చేయవచ్చు కదా, నారదా!
వృషపర్వుడు ఆశగా అడిగాడు.

“నారాయణ ! అందుకేగా వచ్చాను ! ఇంద్రుడికి ఒక గురువును సూచించాను. నీకు ఒక గురువును సూచిస్తే నా సమదృష్టి మీకు తెలిసి వస్తుంది ! ఎంత త్వరగా భృగుదర్శనం చేసుకుంటే అంత మంచిది.”

*”ఇంతకాలం నారదుడు ‘సురపక్షపాతి’ అని అనుకునే వాణ్ని ! వాస్తవానికి నువ్వు ‘అసురపక్షపాతి’ అని ఇప్పుడు అర్ధమవుతోంది నారదా !”” వృషపర్వుడు చిరునవ్వుతో అన్నాడు. *”నారాయణ ! అసురులకు ఆవేశం అధికం అని ఊరికే అన్నారా”” నారదుడు నవ్వుతూ అన్నాడు. ‘”భృగుమహర్షి ఆశ్రమానికి…”

*“ఉగ్రా ! రథం సిద్ధం చెయ్!”* నారదుడికి అడ్డు తగుల్తూ ఆవేశంగా అన్నాడు. వృషపర్వుడు. ‘”అసుర గురువుగానా?”” భృగుమహర్షి సాలోచనగా అన్నాడు.

*”ఔను ! మాకు మార్గ నిర్దేశకులు కరువయ్యారు.

విద్యాదానం చేసే ఆధ్యాపకులు లేరు. ఉశనుల వారిని తమరు అద్వితీయంగా తీర్చిదిద్దారని నారద మహర్షి చెప్తున్నారు. మీరు అంగీకరించాలి, మా కులాన్ని ఆశీర్వదించాలి!”* వృషపర్వుడు వినయంగా అన్నాడు.

“సరే అనండి, భృగుమహర్షీ ! దైత్య దానవ బాలకులూ, యువకులూ విద్యా గంధం లేకుండా వున్నారు. పాపం !”” నారదుడు అందుకుని అన్నాడు..

*”ప్రసాదించండి”* పులోమ కల్పించుకుని అంది. భృగుమహర్షి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. పులోమ చిరునవ్వు నవ్వింది. ‘”ఇలాంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఉశనుడిలాంటి పుత్రుణ్ణి ప్రసాదించమని మిమ్మల్ని అడిగాను.” *”నాన్నగారూ!”* అంత వరకూ మౌనంగా ఉన్న ఉశనుడు అన్నాడు. “అమ్మ సంకల్పాన్ని ఆచరణలో పెడదాం. నాన్నగారూ!”* భృగుమహర్షి తల పంకిస్తూ చిరునవ్వు నవ్వాడు.

*”మీ అందరి అంగీకారాన్ని ఆమెదించకుండా ఎలా ఉంటాను ! ఉశనా ! అసుర గురువుగా శాశ్వత కీర్తిని ఆర్జించాలి సుమా !”* ‘”మీరు అనుగ్రహించిన విద్య నాకు ఆ కీర్తిని  తెచ్చి ఇస్తుంది. నాన్నగారూ !”* ఉశనుడు వినయంగా సగర్వంగా అన్నాడు..

*”అసుర కులం మీ దంపతులకు శాశ్వతంగా ఋణపడి ఉంటుంది, మహాత్మా!”* వృషపర్వుడు భృగుడికి పాదాభివందనం చేశాడు.

*”మాతా ! దీవించండి !” అంటూ పులోమ పాదాలు స్పృశించాడు.

*”వృషపర్వా ! ఉశనుడిని రాక్షస గురువుగా అభిషేకించడానికి రేపు దివ్యమైన ముహూర్తం…”” నారదుడు హెచ్చరించాడు.

*”శుభస్య శీఘ్రం ! వృషా ! నారదుల వారు చెప్పినట్టు రేపే ఆ శుభకార్యం ముగించు” భృగుమహర్షి అన్నాడు.

“అంగరంగ వైభవంగా, ఆ దేవతలను మించి, మా గురుదేవులను పట్టాభిషిక్తుల్ని చేస్తాను !”* వృషపర్వుడు ఆవేశంగా అన్నాడు.



శ్రీ గురు దత్తా

సేకరణ… ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via