November 22, 2024
SGSTV NEWS
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 35 వ అధ్యాయం – శుక్రగ్రహ జననం – 2 



త్రిమూర్తుల సన్నిధిలో పులోమ పుత్రుడి నామకరణోత్సవం జరిగింది. బాలునికి ‘ఉశనుడు’ అని నామకరణం చేశాడు భృగుమహర్షి.

‘”కుమారా ! నీ కుమారుడు కారణజన్ముడు ! దైవికమైన ఆ కారణమే – తనకు ఎలాంటి పుత్రుడు కావాలో నీ అర్ధాంగి పులోమ నోట పలికించింది !”” బ్రహ్మ అన్నాడు. భృగుడితో. ‘”భృగూ ! భవిష్యత్తులో ఉశనుడు నవగ్రహాలలో ఒకడుగా అభిషిక్తుడవుతాడు. అందరికీ ఆరాధ్యుడవుతాడు.”” అన్నాడు శ్రీమహావిష్ణువు. ‘”ఉశనుడికి శాస్త్రబోధ చక్కగా జరగాలి సుమా !”” శివుడు అందుకుంటూ అన్నాడు. “జపవిధానం, తపోవిధానం, ధ్యాననిష్ఠా ఉశనుడికి కరతలామలకాలుగా చేయాలి నువ్వు”* ‘”ఆజ్ఞ!”” భృగువు చేతులు జోడిస్తూ అన్నాడు.. ‘”దేవదేవులైన మీ ఆశీస్సులే నా బిడ్డడిని అద్వితీయుడిగా రూపొందిస్తాయి. ఈ భృగువు నిమిత్తమాత్రుడు!” 

“పులోమా ! నీ పుత్రుడు నీ ఆశయాలను

నెరవేరుస్తాడు”” విష్ణువు పులోమతో అన్నాడు.

*”ఆ సాధ్వీమణి కలలు కన్నది ; కావలసిన

పుత్రుణ్ని కన్నది !”* నారదుడు నవ్వుతూ అన్నాడు. అందరూ నవ్వారు.

సకాలంలో బాల ఉశనుడికి విద్యాభ్యాసం ప్రారంభించిన భృగుమహర్షి – కుర్రవాడి ధారణ శక్తికి అబ్బుర పడిపోయాడు.

తండ్రి బోధించే విషయాలను అవగాహన చేసుకోవడంతో తృప్తిచెందని ఉశనుడు, తనలో ఉద్భవించే రకరకాల సందేహాలను ప్రశ్నల రూపంలో అడుగుతూ – సమాధానాలు తెలుసుకుంటూ, ఇతోధికంగా విషయ గ్రహణం చేయసాగాడు.

భృగుమహర్షి ఆశ్రమంలో లేని సమయాల్లో, ఉశనుడు తనతోపాటు పూలమొక్కల మధ్య, ఫలవృక్షాల మధ్య తిరుగాడే సమయాల్లో – పులోమ అతనికి దేవరాక్షసుల మధ్య నెలకొన్న విరోధం గురించీ, త్రిమూర్తుల సహాయ సహకారాలతో దాయాదులైన అసురులకు దేవతలు కలిగిస్తున్న కష్టాల గురించి  వివరించసాగింది. రానురాను పులోమ బోధనల వల్ల రాక్షసకులం నిస్సహాయంగా దేవతల వల్ల పీడనకు గురి అవుతోందన్న భావం బాలఉశనుడిలో వేళ్ళు తన్నుకోసాగింది. వయసుతోబాటు అసురులు పట్ల ఉశనుడిలో సానుభూతి కూడా పెరగసాగింది. నూనూగు మీసాల వయసు వచ్చేసరికి ఉశనుడి విద్యాభ్యాసం ముగిసింది. తల్లిదండ్రులను సేవిస్తూ, తండ్రివద్ద తపస్సమాధి శిల్పాన్ని నేర్చుకుంటూ, తన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు ఉశనుడు.

అన్నలకూ, ఉశనుడికీ మధ్య మాటతీరులో, ప్రవర్తనలో ఉన్న భేదాన్ని విశ్లేణాత్మకంగా గమనిస్తున్న పులోమ తాను ఆశించిన, కలలుగన్న లక్షణాలన్నీ ఉశనుడిలో వున్నాయన్న సత్యాన్ని గ్రహించి, ఆనందంలో మునిగిపోయింది.

రాక్షసరాజు వృషపర్వుడు సభలో కొలువుదీరి వున్నాడు. దేవతల గురించి చారులు విన్నవిస్తున్న విషయాలను ఆసక్తిగా ఆలకిస్తున్నాడు. భటుడు దగ్గరగా వచ్చి, తలవంచి నమస్కరించాడు. ‘”రాక్షసచక్రవర్తికి జయం ! ప్రభూ, నారదమహర్షి
వచ్చి కొలువు కూటం ముందున్నారు. ప్రవేశపెట్టమని సెలవా ?”*

*”ఊ! వద్దంటే, తిరిగి వెళ్తాడా, ఆ మాటకారి ? ప్రవేశపెట్టు !”” వృషపర్వుడు విసుగ్గా అన్నాడు. ‘“ఆ నారదుడు వెళ్ళిపోయాక… విన్నవించుకో, శూర్పకర్ణా !”” అన్నాడు చారుడితో..

*”నారాయణ ! నారాయణ !”” అంటూ ప్రవేశించాడు నారదుడు.

*”ప్రణామాలు, నారదమునీ!”* వృషపర్వుడు సింహాసనం మీంచి లేవకుండానే, చేతులు జోడించకుండానే అన్నాడు.

*”నారాయణార్పణం !”* నారదుడు అప్రయత్నంగా అన్నాడు.

*”అది మా అసురవీరులను అవమానించే మాట, నారదా !”* వృషపర్వుడు గంభీరంగా అన్నాడు. ‘”ఆ నారాయణుడో, ఏ నారాయణుడో – మాకు ఆగర్భశత్రువని నీకు తెలియదా ?””

*”ఓహ్… తెలిసింది…” నారదుడు నాలుక కరచుకున్నట్టు నటిస్తూ అన్నాడు. అలవాటు కదా
అసుర చక్రవర్తీ ! నోరు జారుతూ వుంటుంది !”.

*”ఏమిటి నారదా, ఏదైనా విశేషం వుందా, పనిగట్టుకుని వచ్చారు !”* వృషపర్వుడు నవ్వుతూ అన్నాడు, తన సమీపంలో ఆసనం మీద కూర్చున్న నారదుణ్ని చూస్తూ.

*”విశేషం ఏముంటుంది, రాక్షసేంద్రా ! నా కార్యక్రమం తెలిసిందే కద ! విషయ సేకరణ, విషయ విస్తరణ, విషయ వితరణ ! ఈ నిత్యసంచారి నిత్యకృత్యం ఇవేకదా వృషపర్వా !”* నారదుడు నవ్వుతూ అన్నాడు.

*”ఇప్పుడు – ఇక్కడికెందుకు దయచేసినట్లు? సేకరణకా ?”” వృషపర్వుడు నవ్వుతూ అడిగాడు.

*”అన్నింటికీ కలిపి అనుకోరాదా?”* నారదుడు నవ్వాడు.

‘”ఆ విధంగా అపార్ధం చేసుకోలేంలే నారదా ! విషయ సేకరణకూ, విస్తరణకూ మాత్రమే వచ్చి వుంటావు ! నువ్వు – నిత్యమూ నీ నోట్లో నానే వ్యక్తిలాగా – సురపక్షపాతివే కదా !””

*”సరే ! విషయ వితరణం చేసి, మీ అభిప్రాయం తప్పు అని నిరూపిస్తాను”” నారదుడు నవ్వుతూ
అన్నాడు. “విషయం ఏమిటంటే… ఇంద్రుడు – అంగిరసపుత్రుడు బృహస్పతిని దేవతల గురువుగా, మంత్రాంగం నెరిపే నేర్పరిగా, వ్యూహ కర్తగా నియమించుకున్నాడు…”” వృషపర్వుడి గుబురు కనుబొమలు మధ్యలో కలుసుకుని, ముడిపడ్డాయి. *”బృహస్పతినా ?

అంత తెలివైన వాడా, ఆ ఋషి పుత్రుడు ?”*

Related posts

Share via