SGSTV NEWS
NationalViral

Uttar pradesh:  నోటితోనే రాళ్లను తీసేస్తున్న కిడ్నీబాబా.. వీడియో వైరల్.

👉పసరు పూసి నోటితోనే కిడ్నిలో రాళ్లు

👉   తీస్తున్నట్టు కవర్ చేస్తున్న బాబా

👉    క్యూ కట్టి వైద్యం చేయించుకుంటున్న  జనాలు

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.. అంటే నిజమో కాదో తెలియదు.. కానీ.. నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు మన సమాజంలో……… దేవుడి పేరు చెప్పి ఎంత పెద్ద రోగాన్ని అయినా తగ్గిస్తానని చాలా మంది మోసాలు చేస్తుంటారు.. అలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.



పూర్తి వివరాల్లోకి వెళితే.. కొందరు దేవుళ్ల పేరు చెప్పుకుని ఎంత పెద్ద రోగమైనా తగ్గిస్తామని ఆపరేషన్లు, స్కానింగ్లు లేకుండానే మంత్రాలతో వైద్యం చేసేస్తారు. రోగం తగ్గినమాట దేవుడెరుగు కానీ మూడనమ్మకాలతో రోగం తగ్గిపోతుందని జనాలు క్యూ కడుతుంటారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో ఓ వ్యక్తి ఎలాంటి స్కానింగ్, ఏమి చేయకుండా కేవలం నోటితోనే కిడ్నీ స్టోన్స్ తీసేస్తానని జనాలను నమ్మిస్తున్నాడు. దీంతో జనాలు కూడా అతడి దగ్గర క్యూ కట్టి మరి వైద్యం చేయించుకుంటున్నారు. కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న ఓ వ్యక్తి బాబా దగ్గరకు వెళ్లగా అతడి వీపుకు ఏదో పసరు రాసి తరవాత నోటితో స్టోన్ తీసేసినట్టు కవర్ చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇంకా ఇలాంటివి నమ్మడమేంటని.. మండిపడుతున్నారు. ముందు ఆ బాబాకు బూత వైద్యం చేయించాలని కామెంట్స్ పెడుతున్నారు.

Also read

Related posts