పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ టీచర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో స్కూల్లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండగా దారుణం చోటు చేసుకుంది. ఆవివరాలు..
మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో చెప్పడం, అంచనా వేయడం చాలా కష్టం. పుట్టుక గురించి అయినా చెప్పుకొవచ్చు కానీ చావు ఎప్పుడు ఎలా వస్తుందో.. ఎవరిని తనతో తీసుకెళ్తుందో చెప్పలేం. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు ఉన్నట్లుండి కుప్ప కూలి.. కన్నుమూస్తున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు వయసు మీద పడటం వల్ల లేదంటే ఏదైనా అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చేరి చనిపోవడం, ఆఖరికి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఎప్పుడు ఎలా చనిపోతామో అర్థం కానీ పరిస్థితుల్లోకి వచ్చేశాం. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు ఈ లోకం విడిచి వెళ్తారో తెలియక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతికే రోజులు ఇవి. ఈ క్రమంలో తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయురాలు స్కూల్లో పాఠం చెబుతుండగా దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
సాధారణంగా స్పోర్ట్స్ టీచర్, పీఈటీ అనగానే మనందరికి చాలా వరకు మగవారే గుర్తుకు వస్తారు. ఆడపిల్లలను క్రీడా రంగంలో ఎంకరేజ్ చేయడం మన దగ్గర ఇప్పటికి కూడా చాలా అరుదుగానే జరుగుతుంది. ఇక ఈ రంగంలో రాణించి.. దాన్నే ఉద్యోగంగా ఎంచుకునే మహిళలు చాలా తక్కువగా ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే మహిళ మాత్రం అందుకు భిన్నం. క్రీడల్లో రాణిస్తూ.. రాష్ట్రానికి ఎన్నో పతకాలు తెచ్చిన ఆమె.. ఆటల మీద ఇష్టంతో క్రీడలనే తన కెరీర్‌గా ఎంచుకుంది. స్పోర్ట్స్ టీచర్‌గా మారింది. ఇలా ఉండగా స్కూల్లో పాఠాలు చెబుతుండగా దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన కేరళలో చోటు చేసుకుంది. మను జాన్(50) అనే మహిళ గతంలో నేషనల్ ప్లేయర్. కేరళ తరఫున ఎన్నో క్రీడా పోటీల్లో పాల్గొని.. అనేక పతకాలు, అవార్డులు గెలిచింది. అలానే ఎంజీ యూనివర్శిటీ క్రాస్ కంట్రీ టీమ్‌కు కెప్టెన్‌గా కూడా ఉండేది. స్పోర్ట్స్ నుంచి తప్పుకున్న తర్వాత ఆమె ఆ తర్వాత ఆమె కొట్టయాంలోని గుడ్ షెప్పర్డ్ స్కూల్లో స్పోర్ట్స్ టీచర్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా గురువారం నాడు.. స్కూల్లో పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుండగా.. దారుణం చోటు చేసుకుంది.
Also read :అందమైన భార్య.. ఆ ఒక్క పనిచేయలేదని భర్త దారుణం!
అప్పటి వరకు పిల్లలతో ఎంతో సరదాగా గడిపిన మను జాన్.. అకస్మాత్తుగా ఉన్నట్లుండి కుప్ప కూలింది. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది అని తెలిపారు వైద్యులు. గుండెపోటు కారణంగానే మను జాను మృతి చెందినట్లు భావిస్తున్నారు.
Also read :భార్యపై కోపంతో అత్తారింటికి వెళ్లి.. మరదళ్లపై బావ అఘాయిత్యం
Andhra Pradesh: గుంత తీసి పాతి పెట్టడానికి సిద్దమయ్యాడు.. డామిట్ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది..!