నారాయణఖేడ్ బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినీలు మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్ రాజేష్ చవాన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ మేరకు అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న విద్యార్థినీలు రాజేష్ పై ఫిర్యాదు చేశారు.
Sexual Harassment:
నారాయణఖేడ్ బీసీ బాలికల హాస్టల్(Narayankhed BC Girls Hostel) విద్యార్థినీలు మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్ రాజేష్ చవాన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ మేరకు అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న విద్యార్థినీలు రాజేష్ పై ఫిర్యాదు చేశారు. సాంఘీక సంక్షేమ శాఖ బీసీ బాలికల వసతి గృహం లో విద్యార్థినులపై వార్డెన్ శారద కుమారుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. వేధిస్తున్నాడని విద్యార్థినీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఈ విషయాన్ని బాలికలు వార్డెన్, హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో నారాయణఖేడ్ పోలీసులకు బాలికలు ఫిర్యాదు చేశారు.
అటు అధికార పార్టీ యువనేత.. ఇటు తల్లి వార్డెన్ అండ చూసుకుని రాజేష్ ప్రతి రోజూ తాగి హాస్టల్‌కు వచ్చి బాలికలపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజేష్ ప్రవర్తన పట్ల ఆయన తల్లి శారదకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అలాగే సిబ్బంది దృష్టికి తీసుకు వెళ్తే అన్నలాంటి వాడే ఏం పర్వాలేదు అంటూ బాలికలను తిడుతున్నారన్నారు. రాజేష్ చవాన్ నిత్యం హాస్టల్‌లోకి ప్రవేశించి, తాము నిద్రపోతున్నప్పుడు అనుచితంగా తాకడం, ఫోటోలు తీయడం చేస్తున్నారని విద్యా్ర్థినీలు ఆరోపించారు.దీంతో ఆ బాలికలు పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థుల నుండి వాంగ్మూలాలు నమోదు చేయడానికి మంగళవారం హాస్టల్‌ను తనిఖీ చేయనున్నారు.
Also read
- సగం ధరకే బంగారం అంటూ ప్రచారం.. ఎగబడి పెట్టుబడి పెట్టిన ప్రజలు.. కట్‌చేస్తే..
- Telangana: వారాంతపు సంతలో నాన్నతో వెళ్లి పల్లీలు కొనుకున్న బాలుడు – రాత్రి తింటుండగా
- మరో దారుణం.. తండ్రితో కలిసి ఇంట్లోనే భర్తను హత్య చేసిన భార్యామణి!
- నేటి జాతకములు….23 జూలై, 2025
- Shravana Masam 2025: ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం.. ముఖ్యమైన పండగలు ఎప్పుడు వచ్చాయంటే..