February 4, 2025
SGSTV NEWS
CrimeTelangana

నాలుగు తుపాకులతో పట్టుబడ్డ నంద్యాల వైసీపీ నేత



మారణాయుధాలు కలిగి ఉండడంతోపాటు ఓ వ్యక్తి హత్యకు కుట్రపన్నిన కేసులో తెలంగాణలోని ఆదిలాబాద్ పోలీసులు.. నంద్యాల జిల్లా సున్నిపెంటకు చెందిన వైసీపీ నేత వట్టి వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెందిన దిలీప్, హిమకాంత్ రెడ్డితో పాటు నకిరేకల్ కు చెందిన ప్రసన్నరాజు లను అరెస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

అరెస్టు చేసిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకే మారణాయుధాలు కొన్నట్లు గుర్తింపు

కర్నూలు, శ్రీశైలం ఆలయం, సున్నిపెంట: మారణాయుధాలు కలిగి ఉండడంతోపాటు ఓ వ్యక్తి హత్యకు కుట్రపన్నిన కేసులో తెలంగాణలోని ఆదిలాబాద్ పోలీసులు.. నంద్యాల జిల్లా సున్నిపెంటకు చెందిన వైసీపీ నేత వట్టి వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెందిన దిలీప్, హిమకాంత్రెడ్డితో పాటు నకిరేకల్కు చెందిన ప్రసన్నరాజ్లను అరెస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది. వెంకటరెడ్డి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ సున్నిపెంటలో పార్టీ వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. ఆయన మాజీ మావోయిస్టు అని, జనశక్తి పార్టీలో రాష్ట్రనేతగా కొనసాగారని పలువురికి అవగాహన ఉంది. అయితే ఆయనపై మూడు హత్యకేసులు, ఒక హత్యాయత్నం కేసు, రెండు టాడా కేసులు సహా మొత్తం పది కేసులున్నట్లు ఆదిలాబాద్ పోలీసులు నిర్ధారించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సున్నిపెంటకు చెందిన వసంతరావు.. సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ లొ ఉండి, 2014లో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ లో చేరారు. కాంగ్రెస్ లొ ఉన్నప్పుడు ఆయనకు అదే పార్టీ నాయకుడైన వెంకటరెడ్డితో తీవ్ర విభేదాలుండేవి.
వసంతరావు వైసీపీ లో చేరడంతో వెంకటరెడ్డి టీడీపి లో చేరారు. ఈ నేపథ్యంలో 2015 మే 15న వసంతరావు హత్య జరిగింది. ఆ కేసులో వెంకటరెడ్డి నిందితుడని పోలీసులు కేసు నమోదుచేశారు. తర్వాత వెంకటరెడ్డి వైసీపీ లో చేరి సున్నిపెంటలో పార్టీ ముఖ్యనేతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర కమిటీలో కొనసాగుతున్నారు.

అప్రమత్తమైన నంద్యాల జిల్లా పోలీసులు

ఆదిలాబాద్ పోలీసులు వెంకటరెడ్డిని అరెస్టుచేయడంతో నంద్యాల జిల్లా పోలీసులు ఉలిక్కిపడ్డారు. నిషేధిత జనశక్తి పార్టీ కార్యకలాపాలను బలోపేతం చేసి, వామపక్ష తీవ్రవాదాన్ని మళ్లీ ముమ్మరం చేయాలన్న ఆలోచనలో వెంకటరెడ్డి ఉన్నట్లు ఆదిలాబాద్ పోలీసులు ప్రకటించడంతో నంద్యాల జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనకు ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న అంశంపై నిఘా పోలీసుల సాయంతో ఆరాతీయడం ప్రారంభించారు. వెంకటరెడ్డితోపాటు అరెస్టయిన దిలీప్, హిమకాంత్రెడ్డి కార్యకలాపాలపైనా కూపీ లాగుతున్నారు.

హత్య చేస్తారేమోనన్న ఉద్దేశంతోనే కుట్ర

తన చేతిలో గతంలో హత్యకు గురైన వ్యక్తుల సంబంధీకులు ప్రతీకారం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారన్న సమాచారంతో వెంకటరెడ్డి అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. తనపై ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం ఉన్నవారిని ముందుగానే మట్టుబెట్టాలన్న ఆలోచనతోనే నాలుగు రివాల్వర్లు, 8 మ్యాగజైన్లు, 18 రౌండ్ల బుల్లెట్లు కొన్నట్లు ఆదిలాబాద్ పోలీసులు గుర్తించారు. వాటితో ఆయన ముఠా పట్టుబడడంతో ప్రణాళిక బెడిసికొట్టినట్లయింది.

Also read

Related posts

Share via