సాధారణ పౌరులకు ఆదర్శంగా నిలువాల్సిన సెలబ్రేటీలే తప్పులు చేస్తున్నారు. హత్య కేసుల్లో హంతకులుగా నిలుస్తున్నారు. తాజాగా హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ అస్సామీ నటి నందిని కశ్యప్‌ను డిస్పూర్ పోలీసులు అరెస్టు చేశారు.
సాధారణ పౌరులకు ఆదర్శంగా నిలువాల్సిన సెలబ్రేటీలే తప్పులు చేస్తున్నారు. హత్య కేసుల్లో హంతకులుగా నిలుస్తున్నారు. తాజాగా హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ అస్సామీ నటి నందిని కశ్యప్‌ను డిస్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. 2025 జూలై 25న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ పార్టీ నుంచి బొలెరో వాహనంలో వెళ్తున్న నందిని గౌహతిలోని దఖింగావ్ ప్రాంతంలో ఓ వ్యక్తిని అత్యంత వేగంతో ఢీకొట్టారు
బాధితుడు 21 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి
ఈ ఘటనలో గాయపడిన బాధితుడిని సమియుల్ హక్‌గా గుర్తించారు. సమియుల్ హక్ అనే 21 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి. అతన్ని ఢీకొన్న తరువాత నందిని కశ్యప్ కనీసం మానవత్వం చూపించకుండా అక్కడినుంచి పారిపోయింది. నందిని కశ్యప్ మద్యం మత్తులో ఉందని, ప్రమాదం జరిగిన వెంటనే ఆమె ఆగకుండా అక్కడి నుండి పారిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే సమియుల్ హక్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాలుగు రోజుల తరువాత అంటే జులై 29వ తేదీన సమియుల్ హక్ కన్నుమూశాడు. హక్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయని, రెండు కాళ్లలో బహుళ పగుళ్లు ఏర్పడ్డాయని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో అతని చేయి, తొడలు విరిగిపోయాయని అన్నారు
సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో
ఈ ఘటనపై హిట్ అండ్ రన్ సు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో నందిని అరెస్టు చేసినట్లు సమాచారం. డిస్పూర్ పోలీసులు నందిని కశ్యప్‌ను అదుపులోకి తీసుకుని దాదాపుగా 8 గంటల పాటు విచారణ జరిపారు. ఈ ఘటనపై సమియుల్ హక్ తల్లి విలపిస్తూ తన కొడుకుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. తాము పేదవాళ్ళమని తెలిపారు. తమకు ఎవరు తెలియదన్నారు. కానీ తప్పు చేసిన వారికి మాత్రం శిక్షపడాలన్నారు. జూలై 25న తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ ప్రమాదం తర్వాత అస్సాంలో ప్రజల నుంచి ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
దర్యాప్తులో జాప్యం
పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నందినిని వెంటనే అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నందిని కశ్యప్ సెలబ్రిటీ కావడంతో దర్యాప్తులో జాప్యం జరుగుతుందని పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆమెను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నందిని కశ్యప్ అస్సామీ సినిమా మరియు టెలివిజన్ పరిశ్రమలో ఒక నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. నందిని కశ్యప్ ఇటీవల రుద్ర అనే అస్సామీ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. నందిని కశ్యప్ కూడా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఆమె తన అభిమానులతో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్‌డేట్‌లను పంచుకుంటారు.
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు