SGSTV NEWS
Sports

Nag Panchami: శ్రావణమాసంలో నాగ పంచమి ఎప్పుడు: ఖచ్చితమైన తేదీ? ప్రాముఖ్యతను తెలుసుకోండి..

నాగదేవతను పూజించడం ద్వారా జాతకంలో కాలసర్ప దోషం నుంచి ఉపశమనం పొందుతారని ఒక నమ్మకం కూడా ఉంది. అదే సమయంలో ఈ రోజున పామును పూజిస్తే పాము వలన మరణ భయం ఉండదని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో కాలసర్ప దోషం ఉంటే అతను జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో నాగ పంచమి రోజున కొన్ని నివారణల ద్వారా కాలసర్ప దోష సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

శ్రావణ మాసం రానుంది. ఆధ్యాత్మిక మాసంలో శుభకార్యాలు, పండుగలు రానున్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శివాలయాల్లో పండగ శోభ కనిపిస్తుంది. నాగ పంచమి రోజున ఆచారాల ప్రకారం నాగదేవతను పూజించి పాలను సమర్పిస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం ఇలా చేయడం వలన నాగేంద్రుడి ఆశీర్వాదం లభిస్తుందని కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందుతాడని విశ్వాసం.

నాగదేవతను పూజించడం ద్వారా జాతకంలో కాలసర్ప దోషం నుంచి ఉపశమనం పొందుతారని ఒక నమ్మకం కూడా ఉంది. అదే సమయంలో ఈ రోజున పామును పూజిస్తే పాము వలన మరణ భయం ఉండదని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో కాలసర్ప దోషం ఉంటే అతను జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో నాగ పంచమి రోజున కొన్ని నివారణల ద్వారా కాలసర్ప దోష సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

2024లో నాగ పంచమి ఎప్పుడు?
నాగ పంచమి రోజును నాగేంద్రుడికి అంకితమైన రోజు. కనుక ఈ రోజున ప్రజలు సర్పానికి పాలు సమర్పించి పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగ పంచమి పండుగ శుక్రవారం, 9 ఆగస్టు 2024 రోజున వస్తుంది.

నాగ పంచమి 2024 శుభ తేదీ
హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి ఆగష్టు 9 న ఉదయం 12:36 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 10న తెల్లవారుజామున 3:14 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం నాగ పంచమి పండుగ ఆగస్టు 9 న జరుపుకుంటారు.

నాగ పంచమి పూజ ముహూర్తం: ఆగస్టు 9 ఉదయం 05:47 నుంచి 08:27 వరకు. ఈ సమయంలో శివ భక్తులు నాగదేవతను పూజిస్తారు.

నాగ పంచమి పూజ విధి

1 నాగ పంచమి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి.

2 తర్వాత దేవతలను ధ్యానిస్తూ శుభ్రమైన దుస్తులు ధరించాలి.

3 ఆ తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.

4 అర్ఘ్య జలాన్ని సమర్పించిన తర్వాత ఇంటిలోని పూజ గదిని శుభ్రం చేసి గంగాజలం చల్లి శుద్ధి చేయాలి.

5 అనంతరం నాగ దేవత చిత్రాన్ని ఏర్పాటు చేసి శుభ్రం చేయాలి.

6 విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత ఆచారాల ప్రకారం పూజించాలి.

7 కుంకుమ, చందనం, పసుపు, అక్షతలు మొదలైన వాటితో నాగదేవతను పూజించాలి.

8 అనంతరం దేశీ నెయ్యితో దీపం వెలిగించి హారతి ఇచ్చి నాగదేవతకు పాలు సమర్పించాలి.

9 ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయని చెబుతారు.

నాగ పంచమి ప్రాముఖ్యత
నాగ పంచమికి సంబంధించి అనేక పురాణ కథలు, నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. హిందూ మతంలో చెట్లు, మొక్కలు, జంతువులు, పక్షులను దేవుళ్ళ వలె పూజిస్తారు. అదే సమయంలో పాములు భూమికి రక్షకులుగా పురాణ కథ. పాములు పంటలకు హాని కలిగించే కీటకాలు, తెగుళ్లను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

పురాణ గ్రంధాల ప్రకారం మహాదేవుడికి పాములు కూడా చాలా ప్రీతికరమైనవి. అందుకే శివుడి మెడలో పాములను ఆభరణాలుగా ధరిస్తాడు. నాగ పంచమి రోజున పాములను పూజిస్తారు. నాగ పంచమి రోజున నాగదేవతను, శివుడిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజు పామును పూజించడం, సేవించడం ద్వారా సకల పాపాలు నశిస్తాయి.. కోరికలు నెరవేరుతాయి. కాలసర్ప దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

Related posts

Share this