SGSTV NEWS online
Famous Hindu Temples

Mysterious Kerala Temple: సైన్స్‌ సైతం చేధించలేని మిస్టరీ సర్ప దేవాలయం.. వణుకు పుట్టించే రహస్యాలు!



శ్రీ నాగరాజ ఆలయం, మన్నరసాల, కేరళ


ఆధ్యాత్మికతకు, అంతులేని రహస్యాలకు మనదేశం పుట్టిళ్లు. అలాంటి మిస్టరీ దేవాలయాలు మనదేశంలో ఎన్నో ఉన్నాయి. వాటిల్లో.. కేరళలోని అలప్పుజ జిల్లాలోని హరిపాడులో పాములతో నిండిన మన్నారశాల శ్రీ నాగరాజ దేవాలయం. అయినప్పటికీ భక్తులు మాత్రం ఎలాంటి భయం లేకుండా అక్కడికి వెళ్తుంటారు. మన్నారశాల శ్రీ నాగరాజ ఆలయం దక్షిణ భారతంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది సర్పారాధనకు ప్రసిద్ధి చెందిన ఆలయం..




కేరళలోని మన్నారశాల శ్రీ నాగరాజ ఆలయం ఇతర భారీ రాతి దేవాలయాల మాదిరిగా కాకుండా మట్టితో చేసినది. దట్టమైన అడవి మధ్యలో ఈ దేవాలయం ఉంది. ఇక్కద దాదాపు 30 వేలకుపైగా సర్ప విగ్రహాలు కనిపిస్తాయి. అంతేకాదు ఈ ఆలయం 3 వేల ఏళ్లకుపైగా పురాతనమైనది. మరో విశేషమేమంటే ఇక్కడ ప్రధాన పూజారి పురుషుడు కాదు బ్రాహ్మణ ఇంటి స్త్రీ పూజారిగా ఉంటుంది. ఆమెను ‘వలియమ్మ’ అని పిలుస్తారు. ఆమెను సాక్షాత్తు సర్ప దేవత ప్రతినిధిగా పరిగణిస్తారు. గుడిలో అన్ని ఆచారాలను వలియమ్మ నిర్వహిస్తుంది. అయితే ఈ గుడిలో నమ్మలేని ఎన్నో రహస్యంలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..



ఈ ఆలయ పురాణగాథ ఇదే..

జానపద కథలు, పురాణాల ప్రకారం.. విష్ణువు అవతారమైన పరశురాముడు సముద్రం నుంచి కేరళను ఏర్పరిచారు. దీని ఫలితంగా సముద్రం నీరు ఉపసంహరించుకుని విషాన్ని మిగిల్చింది. నేల చేదుగా మారి, వృక్షాలు లేకుండా ఎడారిగా మారింది.దీంతో నిస్సహాయంగా భూమిని కాపాడమని పరశురాముడు నాగ దేవతలను, నాగులను ప్రార్థించాడు. నాగులు అతనిపై జాలిపడి భూమిని శుభ్రపరచడానికి దండుగా వచ్చి విషాన్ని తమలోకి తీసుకున్నాయి. ఆ రోజు నుండి కేరళ భూమి మళ్ళీ సారవంతమైంది. కానీ నాగులు ఆ విషాన్ని శాశ్వతంగా మోయడంతో కృతజ్ఞతా చిహ్నంగా పరశురాముడు నాగుల రాజు అయిన నాగరాజు కోసం ఓ ఆలయాన్ని నిర్మించి, ఈ దేశ ప్రజలు ఎల్లప్పుడూ నాగులను రక్షకులుగా పూజిస్తామని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మేరకు ఇప్పటికీ అక్కడ నాగులను పూజిస్తున్నారు. ఈ దేవాలయం దారులు వేలాది రాతి నాగులతో నిండి ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరితే ప్రతిగా రాతి నాగుల విగ్రహాలను ఇక్కడికి తీసుకువచ్చి ఉంచుతారు.

మలయాళ మాసం తులంలో అంటే అక్టోబర్-నవంబర్‌లో జరుపుకునే మన్నారశాల అయిల్యం పండుగ ఈ ఆలయంలో అత్యంత ముఖ్యమైన ఉత్సవం. వలియమ్మ సర్ప విగ్రహాలను అడవిలో ఊరేగింపుగా తీసుకువెళుతుంది. ఈ ఉత్సవాలకు వేలాది మంది భక్తులు దేశ వ్యాప్తంగా తరలివస్తుంటారు. ఉత్సవాల సమయంలో అక్కడ వీచే గాలి పసుపు, గంధం, కర్పూరం సువాసనతో నిండిపోతుంది.




నాగరాజు విగ్రహం ఎందుకు పెరుగుతుంది?

ఇక్కడి దేవాలయంలో ఉండే నాగరాజు విగ్రహం పెరుగుతూ ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ విగ్రహం రాతితోనో, లోహంతోనే ఈ విగ్రహం తయారు చేయలేదు. కొన్ని రహస్య ద్రవ్యాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతీ తరంలో ఆలయ రక్షకులు నాగరాజు విగ్రహం పెరుగుతూ ఉండటం గమనిస్తున్నారు. సైంటిస్టుల దృష్టి ఈ విగ్రహంపై నిలిచినప్పటికీ ఇక్కడ పరిశోధనలు చేయడానికి మాత్రం ఎవరినీ అనుమతించలేదు. ఎవరైనా విగ్రహాన్ని ముట్టుకుంటే నాగరాజు శక్తికి ఆటంకం కలిగి విధ్వంసం సృష్టిస్తుందని అక్కడి స్థానికులు నమ్ముతారు. నాగరాజు విగ్రహం లోపల ఏదో పెరుగుతుంది. అయితే అది మానవ నిర్మితం మాత్రం కాదు.



ఆ 30 వేల రాత నాగులు ఎవరు ఉంచారు?
30 వేల రాతి నాగుల విగ్రహాలకు ఇక్కడ ఎవరు ఉంచారనేది కూడా మిస్టరీగా మారింది. అయితే అక్కడి స్థానికులు ఎవరూ ఈ విగ్రహాలను శుభ్రం చేయరు. వాటికవే శుభ్రం చేసుకుంటాయని స్థానికులు చెబుతారు. ఇక్కడ పూజలు చేసే వలియమ్మ ఒంటరిగా మాత్రమే పూజలు చేస్తుంది. ఆమె పూజ చేసే సమయంలో ఎవరికీ దేవాలయంలోకి అనుమతి ఉండదు. వలియమ్మ తన జీవిత కాలమంతా ఆలయంలో ఒంటరిగా మెడిటేషన్‌ చేస్తూ, అక్కడి సర్పాల స్వరాలను వింటూ ఉంటుంది. ఆమె మరణం తర్వాత ఆమె మృతదేహాన్ని ఆలయంలోనే ఉంచి ప్రార్ధనలు చేసి, ఆ తర్వాత ఖననం చేస్తారు. ఆ తర్వాత బ్రాహ్మణ ఇంటికి చెందిన మరో మహిళ వలియమ్మగా మారుతుంది. వీరిని సర్పరాజే ఎన్నుకుంటాడని నమ్మకం



సంతానంలేని స్త్రీలకు నాగరాజు దర్శనం నిజమేనా?
పిల్లలు లేని మహిళలు ఇక్కడి వచ్చి నాగరాజుకు మొక్కితే వారికి సంతానం కలుగుతుందట. ఇక్కడ పసుపు కలిపిన పాలు పూజ అనంతరం సదరు మహిళలకు అందిస్తారు. ఆ పాలు తాగిన తర్వాత వారు తమ ఇంటికి వెళ్లాక భారీ సైజులో ఉండే పెద్ద నాగుపాము వారి ఇంటికి వచ్చి ఆశీర్వాదం ఇస్తుందట. అయితే ఇది కలలో కాదు. నిజంగానే వారంతా తమ ఇంటికి భారీ సైజులో ఉండే నాగుపాము వచ్చిందని, తాము చూశామని అధిక మంది మహిళలు చెప్పడం విశేషం. అయితే తాము చూసిన పాము ఎలాంటి హాని తలపెట్టకుండా ఆశీర్వదించి వెళ్లినట్లు తెలిపారు. తమకు సంతానం కలిగిన తర్వాత రాతి సర్పం విగ్రహం మన్నారశాల దేవాలయంకి తీసుకొచ్చి అక్కడ ఉంచడం ఆనవాయితీగా వస్తుంది.



అంతేకాదు ప్రతి రోజూ సూర్యస్తమయం తర్వాత ఈ దేవాలయం పూర్తిగా మూసివేస్తారు. ఆ దరిదాపులకు కూడా ఎవరూ వెళ్లరు. ఆలయ రక్షకులుగా అక్కడ వేలాది సర్పాలు కాపలా కాస్తుంటాయని, ఈ సమయంలో ఆలయంలో నాగసర్పాలు సంచరిస్తుంటాయని, వాటికి అంతరాయం కలుగుతుందని నమ్ముతారు





Related posts