Hyderabad | నా భార్య నన్ను కొడుతోంది.. వాతలు పెడుతోంది.. రోజూ టార్చర్ చూపిస్తోంది.. ఆమెతో వేగడం నా వల్ల కాదు.. నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఓ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలాగైనా తన భార్యతో విడాకులు ఇప్పించాలని లేదంటే చచ్చిపోతానని బెదిరిస్తూ చెరువులోకి దిగి నిరసన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన నగేశ్ అనే వ్యక్తి బుధవారం సమీపంలో ఉన్న జయభేరి పార్క్ చెరువులోకి దిగాడు. ఎంతసేపటికి చెరువులో నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అసలు ఏమైందని? ఎందుకు చెరువులోకి దిగావని ప్రశ్నించగా.. తన బాధను మొత్తం వెల్లగక్కాడు. తన భార్య తనను రోజూ కొడుతుందని.. వాతలు పెడుతుందని టీషర్ట్ విప్పి మరీ గాయాలు చూపించాడు.
పిల్లల దగ్గరికి కూడా తనను రానివ్వడం లేదని.. ప్రేమతో చాక్లెట్స్ తీసుకెళ్తే వాళ్లను తిననివ్వట్లేదని నగేశ్ వాపోయాడు. మీ డాడీ ఎక్కడ అని అడిగితే చనిపోయాడని చెప్పాలని పిల్లలకు నేర్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. రోజూ టార్చర్ చేస్తుందని.. తనకు విడాకులు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. తన సమస్యను పరిష్కరించకుంటే అదే చెరువులో దూకి సచ్చిపోతా అని బెదిరించాడు. నగేశ్ ఆవేదన విన్న స్థానికులు అతనికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Also read
- Somanath Temple: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. రూ.25లకే సోమనాథుడికి బిల్వ పత్రం సమర్పించి రుద్రాక్షను పొందవచ్చు.. ఎలాగంటే..
- Navagrahas: నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్లు కడుక్కోవాలా?.. ఈ పొరపాట్లు చేయకండి..
- Telangana: కొడుకు కాదు.. కాలయముడు.. కాసుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు!
- నేటి జాతకములు..2 జూలై, 2025
- చెత్త లారీలో మృతదేహం.. వీడిన మిస్టరీ! షంషుద్దీన్తో ఏడాదిన్నరగా వివాహేతర బంధం.. ఆ తర్వాత