చరవాణిలో ఓ రుణ యాప్ అతివను బలితీసుకుంది. చిన్నారులకు తల్లిని లేకుండా చేసింది. పచ్చని కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది.
Also read :పట్టపగలు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ
మంటాడ(పమిడిముక్కల), : చరవాణిలో ఓ రుణ యాప్ అతివను బలితీసుకుంది. చిన్నారులకు తల్లిని లేకుండా చేసింది. పచ్చని కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఆన్లైన్ మోసానికి నిండు నూరేళ్ల జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ‘బావా తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు. నా ముఖం నీకు ఎలా చూపించగలను? రుణం విషయంలో మోసపోయాను. నాకు భయంగా ఉంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా’.. అంటూ సెల్ఫీ తీసుకొని మరీ ఓ వివాహిత తనువు చాలించిన దారుణ ఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో చోటుచేసుకుంది.
Also read :Watch Video: గుండె తరుక్కుపోయే ఘటన.. మోకాళ్లపై గిరిజనుల మొర.. ఎందుకంటే..
సంక్షిప్త సందేశాలు చూసి..
మంటాడకు చెందిన పేటేటి స్రవంతి(28)కి చరవాణిలో రూ.5 లక్షలు రుణం ఇస్తామని ఒక సందేశం వచ్చింది. కష్టకాలంలో కుటుంబానికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఆ నంబరును సంప్రదించింది. రూ.5 లక్షలు రుణం ఇచ్చేందుకు తొలుత రూ.20 వేలు, తరువాత రూ.60 వేలు, వరుసగా రూ.80 వేలు చెల్లించమంటే అప్పు తెచ్చి ఓ లక్ష చెల్లించింది తర్వాత మరో రూ.1.20 లక్షలు చెల్లిస్తే మొత్తం రుణం ఇచ్చేస్తామంటూ మరో సందేశం రావడంతో తాను ఇక కట్టలేనని, మోసపోయానని గ్రహించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పుకోలేకపోయింది. తాను తప్పు చేశాననే బాధతో భర్తకు ముఖం చూపించలేక భర్త శ్రీకాంతను ఉద్దేశించి సెల్ఫీ వీడియో తీసి అందులో జరిగిన విషయాన్ని పుట్టెడు దుఃఖంతో వివరించింది

తల్లిని కోల్పోయిన చిన్నారులు
బావా.. తప్పుచేశాను. మన కుటుంబం కోసమే ఈ పనిచేశాను.. నీకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ’ సెల్ఫీ తీసుకొని ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఉయ్యూరు ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. సోమవారం మధ్యాహ్నం అక్కడ ఆమె మృతి చెందింది. తన మరణానికి కారణం అంతా వివరిస్తూ చరవాణిలో ఆమె పెట్టిన సెల్ఫీ బయటకు వచ్చింది. స్రవంతికి 6, 4 సంవత్సరాల కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె పుట్టిల్లు ఇదే మండలం కృష్ణాపురం కాగా.. ఆమె మేనత్త కొడుకు శ్రీకాంత్తో వివాహమైంది. అతడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చరవాణిలో ఇలాంటి యాప్లను నమ్మవద్దని తాము పదేపదే ప్రచారం చేస్తున్నా కొంతమంది అర్ధం చేసుకోలేక ఇలా చిక్కుల్లో పడి పండంటి జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారని, ఇకనైనా అవగాహనతో మెలగాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also read :సెల్ ఫోన్ కోసం యువతి దారుణం.. అసలు ఏం జరిగిందంటే?
Crime News: స్నానాల గదిలో.. తల్లి, తండ్రి, కుమారుడి మృతి
భార్య, కుమార్తెను హతమార్చి.. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య