రోజూ మద్యం తాగొచ్చి చిత్రహింసలు పెడుతుండడం భరించలేక ఓ మహిళ తన తల్లితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలో శనివారం రాత్రి జరిగింది. ముప్పారం గ్రామానికి చెందిన మోడెం రమేశ్ (36)కు క్యాతంపల్లికి చెందిన స్వాతితో 2012లో వివాహమైంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ క్యాతంపల్లిలోనే ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎఫ్‌సీఐ కూలీగా పనిచేస్తున్న రమేశ్ మద్యానికి బానిసై నిత్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. గతంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా రమేశ్‌లో మార్పు రాలేదు. రోజు మాదిరిగానే శనివారం కూడా రమేశ్ తాగి వచ్చి భార్య స్వాతిని, అత్త అటికం లక్ష్మిని తిడుతూ, కొట్టడానికి ప్రయత్నించాడు. దీంతో పిల్లలతో కలిసి వారు బయటకు వెళ్లి ఇంటి పక్కన పడుకున్నారు. రాత్రి 9 గంటల టైంలో స్వాతి పిల్లలను అక్కడే పడుకోబెట్టి తన తల్లి లక్ష్మితో కలిసి ఇంట్లోకి వెళ్లింది. మద్యం మత్తులో పడుకున్న భర్తను బయట బాత్రూం వరకు లాక్కొచ్చి కర్రలతో కొట్టి హత్య చేశారు. రమేశ్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి పిల్లలు వద్ద వెళ్లి పడుకున్నారు. తెల్లవారుజామున రమేశ్ చనిపోయాడని స్వాతి అతడి కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే క్యాతంపల్లికి వచ్చిన కుటుంబసభ్యులు రమేశ్ ఎలా చనిపోయాడని స్వాతిని ప్రశ్నించడంతో తాగి వచ్చిన తర్వాత కిందపడి చనిపోయాడని సమాధానమిచ్చింది. మృతుడి అన్న వీరేశం అనుమానంతో రమేశ్ డెడ్‌బాడీని పరిశీలించగా కొట్టినట్లు గాయాలు కనిపించాయి. దీంతో నిజం చెప్పాలని స్వాతిని నిలదీయడంతో తాగి వచ్చి చిత్రహింసలు పెడుతున్నందున తన తల్లితో కలిసి తానే కొట్టి చంపినట్లు స్వాతి ఒప్పుకుంది. దీంతో వీరేశం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ధర్మసాగర్ ఇన్స్‌పెక్టర్ మహేందర్ తెలిపారు.
Also read
- ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
- హెల్త్ సూపర్వైజర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!
- Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ
- ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో