శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి దేవాలయం
ఐ.పోలవరం మండలానికి చెందిన మురమళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం జిల్లాలోని ఒక చారిత్రక ప్రదేశం.స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంన్నారు ఇక్కడ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమం ప్రకారం పురోహితులు నిత్యకళ్యాణం జరిపిస్తారు .
దీనితోపాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరోవిశేషం . ఇక్కడ స్వామి వారికి రోజువారీ నిత్యకల్యాణం నిర్వహిస్తారు. ప్రతిరోజు దాదాపు వందల మంది యాత్రికులు వారి పూజలు నిర్వహించడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం 05 గం.ల నుండి స్వామి కల్యాణములు చేయబడుతాయి.
స్థల పురాణం:
దక్షయజ్ఞము అనంతరము వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షునకు మేక తలను తగిలించి దక్షుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తముగా దక్ష యజ్ఞమును పూర్తి గావించెను.
కాని సతీదేవి అగ్నిని పుట్టించుకుని ఆహుతి అవుటచే కలిగిన కోపము ఎందరు ప్రయత్నించిననూ ఎంతకునూ శాంతించపోవుటచే త్రిమూర్తులతో కూడి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థించగా జగన్మాత తన శోడష కళలలో ఒక కళను భద్రకాళి నామమున వీరభద్రుని శాంతింప చేసేందుకు పంపించెను.
భద్రకాళి ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుని క్రోధము చల్లారకుండుటచే ‘అశ్శరభ శరభ’ అనుచూ ప్రక్కనే గల తటాకమునందు మునిగి భీకరమైన భద్రకాళీ రూపమునుండి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రునకు కనిపించెను.
అంతట వీరభద్రుడు శాంతించుటతో దేవతలు మునులు వారిరువురికీ గాంధర్వ పద్ధతిన మునిమండలి ప్రాంతమున వివాహము చేసిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదేరీతిన గాంధర్వ కళ్యాణం జరుగుతున్నది.
ఆలయ నిర్మాణం:
ఈ కథాగమనము జరిగిన పిమ్మట ఆ పరంపరలో పూర్వదేవాలయము ఏర్పడినది. కాలక్రమములో వరదలు సంభవించుత చేతను, ఇతర ప్రకృతి వైపతీత్యముల వలననూ పూర్వదేవాలయము నదిలోనికి వరిగిపోయింది.
అంతట కొమరగిరి వాస్తవ్యులు ప్రసిద్ధ శివభక్తులు వెలువలి శరభరాజుగారి స్వప్నమునందు స్వామి సాక్షాత్కరించి ఆలయ పునర్నిర్మాణము తాను అనుజ్ఞ ఇచ్చిన విధమున కావించవలసిందిగా ఆదేశించారు. అట్లే శరభరాజుగారు మరికొందరు పూర్వ ఆలయమునుండి శివలింగమును తీయుటకు ప్రయత్నించగా అశరీరవాణిగా ఈ విధముగా వినవచ్చింది.
తనను చేతులపై లేపి పోలవరమునందున్న భాణేశ్వరస్వామి ఆలయము మార్గములో తీసుకుపోవలెనని మార్గమున ఏదో ఒకప్రాంతమున అలవికాని బరువుగా మారిపోతాననీ అక్కడే తన ఆలయము నిర్మించవలెననీ తెలియజేసెను.
అలా శివలింగమును చేతులపై మోసుకు పోతున్న వారికి మురమళ్ళ గ్రామంన ఒక ప్రదేశానికి రాగానే మోయనలవికాని విపరీత బరువు అగుటతో అక్కడే దించి ఆలయము గోపుర నిర్మాణములు కావించి వైభవముగా ప్రతిష్ఠా కార్యక్రమములు నిర్వహించిరి.
అప్పటి నుండి ప్రతి సంవత్సరం వైభవముగా కళ్యాణ మహోత్సవములు నిరంతరాయముగా నిర్వర్తిస్తున్నారు.
స్వామివారికి ప్రతి రోజూ వివాహం.. ఆ స్వామిని దర్శించుకునేవారికి వెంటనే కళ్యాణయోగం
వృద్ధగౌతమి నదీ తీరంలో వెలిసిన సుప్రసిద్ధ శైవక్షేత్రం మురమళ్ల. ఇక్కడ ప్రధాన దైవం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి. స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్నారు.
వీరభద్రు భద్రకాళి కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమం ప్రకారం పురోహితులు నిత్యకళ్యాణం జరిపిస్తారు. ఇక్కడ స్వామివారికి వివాహం జరిపిస్తే తమ సంతానానికి త్వరగా వివాహమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందువల్లే దాదాపు నెల ముందుగానే తమ పేర్లను భక్తుుల వివాహ మహోత్సవం జరిపించడానికి నమోదు చేసుకొంటారు.
స్వామివారికి దాదాపు మూడు గంటల పాటు వివాహమహోత్సవం జరుగుతుంది. దీనిని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. కల్యాణంతో పాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరోవిశేషం. శివరాత్రి మహోత్సవం సమయంలో మురమళ్ల వీరేశ్వరస్వామి దేవాలయం భూ కైలాసంగా భక్తులతో కీర్తించబడుతుంది.
రోజుకిన్ని కళ్యాణాలు అన్న లెక్క ఉండటంతో భక్తులు సుమారు నెల రోజులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకొంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం నిత్యాన్నదానం, వసతి సౌకర్యం ఉంది. కాకినాడకు 36 కిలోమీటర్లు, రాజమండ్రికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
పురాణాల కథ ప్రకారం దక్షుడు అనే రాజు ఒక గొప్ప యాగం చేయాలని భావిస్తాడు.. ఈ యాగానికి సొంతకూతురు దాక్షాయణిని అల్లుడు శివుడిని ఆహ్వానించడు. అయితే తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకున్న దాక్ష్యాయణి భర్త ఎంత వారిస్తున్నా వినకుండా పుట్టింటి మమకారంపై యాగశాల వద్దకు చేరుకుంది.
అయితే అక్కడ తీవ్రంగా అవమానింపబడుతుంది. దీంతో ఆత్మాహుతికి పాల్పడుతుంది దాక్షాయణి. ఈ విషయం తెలుసుకున్న శివుడు తీవ్ర ఆగ్రహంతో వీరభద్రుడిని సృష్టించి దక్ష యజ్ఞం నాశనం చేయమని పంపిస్తాడు.
అపుడు భద్రకాళి అమ్మవారు మురమళ్ల దగ్గర ఉన్న తటాకంలో మునిగి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రుడికి కన్పిస్తుంది. దీంతో వీరభద్రుడు శాంతించాడు. వెంటనే అక్కడ ఉన్న దేవతలు మునులు వారిరువురికీ గాంధర్వ పద్ధతిన వివాహం చేశారు.
అప్పటి నుండి ప్రతి సంవత్సరం గాంధర్వ రీతిన కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తమ సంతానానికి వివాహం ఆలస్యమవుతున్నవారు ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయిస్తే త్వరలో ఫలితం కనబడుతుందని చెబుతారు.అలా భక్తులు జరిపించే వివాహం నిత్యం జరుగుతూ ఉంటాయి.
కాలక్రమములో ఈ ప్రాంతంలో వరదలు సంభవించడం.. ఇతర ప్రకృతి వైపరీత్యాలతో ఆలయం గోదావరినదిలోకి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత ఓ భక్తుడి కలలో కనిపించిన స్వామి తనకు ఆలయ నిర్మాణం చేయవలసిందిగా ఆదేశించారట.
స్వామివారి మహాలింగమును చేతులపై తీసుకోస్తుండా మురమళ్ళలోని ఒక ‘పవిత్ర స్థలము చేరేసరికి ఆ దివ్యలింగము భారం పెరిగి అది స్వామివారి ఆజ్ఞగాభావించి అక్కడే మహా లింగం ఉంచి .. అక్కడే సా స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టారని స్థల పురాణంద్వారా తెలుస్తోంది. ఇప్పటికీ పూర్వం వలె మహావైభవముగా నిత్య కళ్యాణము స్వామివారికి జరుగుతూనే ఉన్నాయి.
ఆలయ సమయాలు:
ఉదయం : 5am–12pm
సాయంత్రం : 4pm–9pm
SRI BHADRAKALI SAMETA VEERESWARA SWAMY DEVASTHANAM
To
The Executive Officer
Sri Veereswara Swamy Vari Devastanam
MURAMALLA- 533220
I.POLAVARAM
EAST GODAVARI DISTRICT
CALL : 94901 11136