కూతురికి, నాకు మధ్య చిచ్చుపెట్టాలని చూశారన్న ముద్రగడ
పెళ్లి అవ్వడంతో నా కూతురు నా ప్రాపర్టీ కాదని వ్యాఖ్య
ఎవరి బెదిరింపులకూ భయపడనున్న వైసీపీ నేత
పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని ఒకరు.. గెలిపించొద్దని మరొకరు.. కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కూతురు క్రాంతి భారతి మధ్య మాటల యుద్ధం చెలరేగింది. పవన్ కల్యాణ్‌ని తిట్టడానికి మాత్రమే తన తండ్రి ముద్రగడని సీఎం జగన్ వాడుకుంటున్నారని, అందుకు భిన్నంగా తాను పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం కోసం కృషి చేస్తానంటూ క్రాంతి భారతి చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు.
నా కూతురు నా ప్రాపర్టీ కాదు..
తనకు, తన కూతురికి మధ్య చిచ్చు పెట్టాలని చూశారని, కానీ తాను బెదిరిపోనని ముద్రగడ పద్మనాభం అన్నారు. ‘‘నా కూతురు నా ప్రాపర్టీ కాదు’’ అని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. ఆమెకి పెళ్లి అవ్వకముందు తన ప్రాపర్టీ అని, వివాహం అవడంతో ఆమె అత్తగారి ప్రాపర్టీ అని అన్నారు. తన కూతురి వ్యాఖ్యలకు భయపడనని ముద్రగడ అన్నారు. తన కూతురితో వీడియో రిలీజ్ చేయించారని, ఎవరు బెదిరించినా తాను బెదిరిపోనని ముద్రగడ పద్మనాభం అన్నారు. తాను ఎప్పటికీ జగన్‌కి సేవకుడిగానే ఉంటానని అన్నారు.
తండ్రిపై క్రాంతి భారతి విమర్శలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం ప్రచారం చేస్తున్న వైఖరిని క్రాంతి భారతి తప్పుబట్టారు. కేవలం పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నారని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ శుక్రవారం ఎక్స్ వేదికగా విడుదల చేసింది. ‘‘ పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత విజయం కోసం నా తండ్రి పనిచేయవచ్చు. కష్ట పడవచ్చు. అందులో తప్పు లేదు. కానీ జగన్ మెప్పు కోసం పవన్ కల్యాణ్ మీద వాడుతున్న భాష సరికాదు. ముద్రగడ తీరు మార్చుకోవాలి. ఎన్నికల సమయంలో ముద్రగడను సీఎం జగన్ వాడుతున్నారు. ఈ విషయం ముద్రగడ తెలుసుకుంటే మంచిది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం నా వంతుగా కృషి చేస్తా’’ అని క్రాంతి భారతి ఆ వీడియోలో పేర్కొన్నారు.
Also read
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!