March 15, 2025
SGSTV NEWS
CrimeTelanganaViral

Drunken Girl: మద్యం మత్తులో మూవీ ఆర్టిస్ట్ హల్చల్.. నడిరోడ్డుపై హోంగార్డుపై దాడి!



మద్యం మత్తులో మూవీ ఆర్టిస్ట్ హల్చల్
పోలీసులకు చుక్కలు చూపించిన సరిత
అడ్డుకునేందుకు యత్నించిన హోంగార్డుపై దాడి

ఓ యువతి మందేసిన మైకంలో నడి రోడ్డుపై చిందులేసింది. తాగి ఊగి రోడ్డుపై తైతక్కలాడింది. మూవీ ఆర్టిస్టు మేకల సరిత మధురా నగర్‌లోని మెయిన్ రోడ్డుపై పోలీసులకు చుక్కలు చూపించింది. మద్యం తలకెక్కిన మైకంలో చరణ్ అనే వ్యక్తిని దుర్బాషపడింది. అటుగా వెళ్ళేవారిని వదలకుండా విరుచుకుపడింది. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసుల విధులకు ఆటంకపర్చింది

మద్యం మత్తులో నడి రోడ్డుపై మూవీ ఆర్టిస్టు సరిత న్యూసెన్స్ సృష్టించింది. అడ్డుకునేందుకు యత్నించిన మహిళా హోంగార్డుపై సైతం దాడి చేసింది. సరిత ప్రవర్తననతో పోలీసులు విసిగిపోయి.. ఆమె భర్త రాజేష్‌కు ఫోన్ చేసి పిలిపించారు. మద్యం మత్తులో వీరంగం చేస్తున్న ఆమెని ఇంటికి తీసుకెళ్ళాలని భర్త రాజేష్‌కు సూచించారు. మధురానగర్ పోలీసులు సరితపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో సరితా చేసిన పనితో మధురా నగర్‌లో అందరూ షాక్ అయ్యారు. సరితకు సంబందించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read

Related posts

Share via