April 14, 2025
SGSTV NEWS
CrimeTelangana

TG Crime: నా కడుపున ఎలా పుట్టావురా.. అత్యాచారయత్నం చేసిన కొడుకును చంపిన తల్లి!


తెలంగాణలో అమానవీయ ఘటనచోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా మహాముత్తారంలో తల్లిపైనే కొడుకు నరేష్ మద్యంమత్తులో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తనను తాను రక్షించునే క్రమంలో నరేష్‌ను రోకలిబండతో కొట్టి చంపింది తల్లి. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

TG Crime: దేశవ్యాప్తంగా లైంగిక దాడులు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. గుర్తుతెలియని మహిళలపైనే కాదు సొంతింటి ఆడవాళ్లపైన కూడా దుర్మార్గులు ఆఘయిత్యానికి పాల్పడుతున్నారు. కాంమవాంఛతో రగిలిపోతున్న రాక్షసులు వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ దారుణమైన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. నవమాసాలు మోసి పాలిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిపైనే ఓ దరిద్రుడు అత్యాచారయత్నానికి పాల్పడటం పెద్దపెల్లి జిల్లాలో కలకలం రేపింది.


భార్యతో విడాకులు తీసుకుని..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా మహాముత్తారానికి చెందిన రాజయ్య- లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. సోమగూడెంలో సింగరేణి కార్మికుడిగా రిటైర్డ్ అయిన రాజయ్య.. మహాముత్తారంలో నివాసం ఉంటున్నాడు. అయితే రాజయ్య, లక్ష్మి దంపతుల చిన్న కొడుకు నరేష్‌- కు భార్యతో గొడవలు జరిగాయి. దీంతో నాలుగేళ్ల క్రితం ఆమె విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే భార్య దూరం అయ్యాక మద్యానికి బానిసైన నరేష్.. ప్రతీరోజు మద్యంతాగి తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు.

అయితే గురువారం రాత్రి మద్యంతాగి ఇంటికి వచ్చిన నరేష్.. నిద్రిస్తున్న తల్లి చేయిపట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. నరేష్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా అతను మరింత బలంగా దాడి చేయబోయాడు. దీంతో భయంతో చేసేదేమి లేక పక్కనే ఉన్న రోకలి బండతో తల్లి లక్ష్మి దాడి చేసింది. తీవ్ర గాయాలు కావడంతో నరేష్ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లక్ష్మిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Also read

Related posts

Share via