SGSTV NEWS
CrimeTelangana

Mother Killed by Daughter: హైదరాబాద్‌లో దారుణం.. టాబ్లెట్‌లు వేసుకోలేదని తల్లిని రాడ్డుతో కొట్టి చంపిన కూతురు


ఎస్సార్ నగర్‌లో ఓ కూతురు తన కన్నతల్లిని కడతేర్చింది. ఇనుప రాడ్డుతో తల్లి తలపై బాది అతి కిరాతకంగా హతమార్చింది. తల్లి టాబ్లెట్లు వేసుకోకపోవడంతో కూతురు సహనం కోల్పోయింది. ఇంట్లో ఉన్న ఇనుపరాడుతో దాడిచేసి తల్లిని హతమార్చింది.

సమాజంలో అసహనం పెరిగిపోతుంది.దీంతో మనుషులు తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని మరిచిపోయి ఇష్టరీతిన ప్రవర్తిస్తున్నారు. తన, మన అనే తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో చేసే పనులు మనిషి ప్రాణాలను తీసేస్తున్నాయి. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు, తండ్రిని కొడుకులు, కొడకుల్ని తల్లులు ఇలా ఒకరినొకరు చంపుకుంటున్నారు. తర్వాత ఏం జరుగుతుందనే ఆలోచన లేకుండా కన్నవారిని కట్టుకున్నవారిని కడతేర్చుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే హైదరబాద్‌ నగరంలో చోటుచేసుకుంది. ఎస్సార్ నగర్‌లో ఓ కూతురు తన కన్నతల్లిని కడతేర్చింది. ఇనుప రాడ్డుతో తల్లి తలపై బాది అతి కిరాతకంగా హతమార్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సార్ నగర్‌లో 90 ఏళ్ల వయసున్న ఓ వృద్దురాలు తన కూతురుతో కలిసి ఉంటుంది. అయితే ఆ వృద్దురాలికి అనారోగ్యం కారణంగా టాబ్లెట్లు వాడుతోంది. ఈ రోజు ఆమె టాబ్లెట్లు వేసుకోకపోవడంతో కూతురు సహనం కోల్పోయింది. ఇంట్లో ఉన్న ఇనుపరాడ్డుతో తల్లి తలపై ఇష్టం వచ్చినట్లు బాది చంపింది. దీంతో వృద్దురాలు అక్కడికక్కడే కనుమూసింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరును పరిశీలించారు. కాగా  హత్య చేసిన నిందితురాలైన కూతురు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కారణంగానే క్షణికావేశంలో తల్లిని చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కూతుర్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు.

Also read

Related posts