April 3, 2025
SGSTV NEWS
CrimeNational

తన కూతురు కన్నా బాగా చదువుతుందని మరో చిన్నారిపై అమ్మ దారుణం!

జోయా, అర్చన ఇద్దరూ ఓకే క్లాస్. మంచి ఫ్రెండ్స్ కూడా. జోయా తండ్రి అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే జోయా కన్నా అర్చన కాస్త చదువులో ముందుండేది. అయితే ఓ రోజు జోయా ఇంటికి వెళ్లింది అర్చన..

Also read :విడాకులు ఇవ్వమంటే వినలేదు.. ఆగ్రహంతో రగిలిపోయిన భర్త.. చివరకు భార్యను

గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శోక్లం గురువు గొప్పతనం గురించి చెబుతుంది. తమ స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి..పిల్లల కోసం పాటుపడేది ఉపాధ్యాయులు. కానీ నేటి కాలంలో కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు టీచర్లు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సాధారణంగా విద్యార్థులు బాగా చదివితే టీచర్లు మెచ్చుకుంటారు. కానీ అర్చన బాగా చదువుతుందని తట్టుకోలేకపోయింది ఓ టీచర్ భార్య. ఆ విద్యార్థినిని మానసికంగా వేధించడం మొదలు పెట్టింది. అటు టీచర్ కూడా సూటి పోటీ మాటలు అనేసరికి తట్టుకోలేకపోయింది విద్యార్థిని. చివరకు తనువు చాలించింది.

Also read :భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య జంప్.. నెలన్నర కూతురు తల్లికోసం ఏడుపు

సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు అర్చన మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కానీ ఆత్మహత్య లేఖ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు వెలికి తీశారు. కూతురు కన్నా చదువులో ఎక్కువ రాణిస్తుందని భరించలేక అర్చనను వేధించడంతోనే ఆమె సూసైడ్ చేసుకుందని తేలింది. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లాలో చోటుచేసుకుంది. హావేరి జిల్లా దూదిహళ్లి మొరార్జీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని అర్చన గౌడన్న ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్చన దూదిహళ్లిలోని మొరార్జీ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుతోంది. ఆమెకు టీచర్‌గా పనిచేస్తున్నాడు ఆరీఫుల్లా.

Also read :భారతీయుడు2 సినిమా చూస్తూ.. అచ్చం అదే స్టైల్‌లో మర్డర్ స్కెచ్.. బిత్తరపోయిన ప్రేక్షకులు..!

ఆయన కుమార్తె జోయా కూడా అదే స్కూల్లో చదువుతుంది. అర్చన, జోయా ఒకే తరగతి చదువుతుండటంతో ఇద్దరూ స్నేహితులయ్యారు. అయితే చదువులో జోయా కంటే అర్చన కాస్త ముందుంటుంది. ఇది తట్టుకోలేని ఆరీఫుల్లా భార్య అర్చనను ఇంటికి పిలిపించి వేధింపులకు గురి చేసింది. దీంతో మనస్తాపానికి గురైన అర్చన పది రోజుల క్రితం డెత్ నోట్ రాసి జూలై 2న ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు డెత్ నోట్ రాసింది. ఉపాధ్యాయుడి భార్యపై తీవ్ర ఆరోపణలు చేసింది. ‘నా కూతురు కన్నా నువ్వు చదువులో ముందున్నావని, వెటకారంగా మాట్లాడతున్నారంటూ’ అంటూ వేధించేవారు. ఇటు టీచర్ కూడా వేధించాడు. అంతేకాకుండా డెత్ నోట్‌లో వ్యక్తిగత కారణాలను కూడా అర్చన పేర్కొంది. అయితే అర్చన తల్లిదండ్రులకు తెలిసినా దహన సంస్కారాలు పూర్తి చేశారు. అయితే విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు సుమోటోగా తీసుకున్నారు. హిరేకెరూర్ తాలూకాలోని అలడకట్టి గ్రామంలో పూడ్చిపెట్టిన విద్యార్థిని మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కేసు నమోదు చే సి విచారణ చేపడుతున్నారు

Also read :భర్త కార్పెంటర్.. భార్యను కష్టపడి చదివిస్తే.. ప్రియుడితో కలిసి

Related posts

Share via