SGSTV NEWS online
Andhra PradeshCrime

సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో మొగల్తూరు సబ్ రిజిస్టర్


ఏసీబీ అధికారులు మంటూ బురిడీ రూ. 2లక్షలు ఫోన్ పంపింన సబ్ రిజిస్టర్

పోలీసులకు పిర్యాదు చేసిన సబ్ రిజిస్టర్ శ్రీనివాస్


నరసాపురం, మొగల్తూరు(పశ్చిమగోదావరి జిల్లా): మొగల్తూరు సబ్ రిజిస్టర్ సబ్బిత శ్రీనివాసులు సైబర్ నేరగాళ్లు ఏసీబీ పేరుతో బెదిరించి రెండు లక్షల కొట్టేశారు. మరో లక్ష రూపాయలు కోసం డిమాండ్ చేయటంతో అనుమానం వచ్చిన సబ్ రిజిస్టర్ మొగల్తూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బెదిరించింది సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారని నిర్ధారించుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ కు ఏసీబీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ‘నీ మీద అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, మేము రాకుండా ఉండాలంటే మూడు లక్షలు మా అకౌంట్లో వేయాలని’ కాల్ చేశారు. దీంతో శ్రీనివాస్ భయపడి ముందుగా రెండు లక్షలు ఫోన్ పే చేశాడు.  అయినప్పటికీ కేటుగాళ్ళు విడిచి పెట్టలేదు. మిగిలిన లక్ష రూపాయలు అకౌంట్లో వెయ్యాలని పట్టుపట్టడంతో అనుమానం వచ్చిన సబ్ రిజిస్టర్ మొగల్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బుధవారం మొగల్తూరు ఎస్సై వై.నాగలక్ష్మి కేసు నమోదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంక్ అకౌంట్, సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Also Read

Related posts