June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

అటవీ అధికారులపై మూకుమ్మడి దాడి

అటవీ ప్లాంటేషన్ భూముల్లో సాగుకు సిద్ధపడుతున్నారన్న సమాచారం మేరకు అడ్డుకునేందుకు సిబ్బందితో వెళ్లిన ఎస్ఆర్వోపై స్థానికులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది.

నిజామాబాద్ జిల్లా కాల్పోల్లో ఘటన: మోపాల్, : అటవీ ప్లాంటేషన్ భూముల్లో సాగుకు సిద్ధపడుతున్నారన్న సమాచారం మేరకు అడ్డుకునేందుకు సిబ్బందితో వెళ్లిన ఎస్ఆర్వోపై స్థానికులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత అటవీ అధికారులు, ఎస్ చ్ల్వో గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పోల్ గ్రామం వెనుక గుట్టపై ఏర్పాటుచేసిన ప్లాంటేషన్ అటవీ భూముల్లో అదే గ్రామానికి చెందిన మోతీలాల్ కుటుంబసభ్యులు ట్రాక్టర్తో దున్నుతున్న
విషయం తెలుసుకొని ఎస్ఆర్వో రాధిక, సెక్షన్ అధికారి సాయికృష్ణ, బీట్ అధికారులు ప్రగతికుమార్, ప్రసాద్, లింబాద్రి వెళ్లారు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా మోతీలాల్ కుటుంబ సభ్యులతో వాగ్వాదం, తోపులాట జరిగింది. మోతీలాల్కు మద్దతుగా గ్రామం నుంచి మహిళలు, యువకులు వచ్చారు. అటవీ
అధికారులు చరవాణిలో చిత్రీకరించేందుకు ప్రయత్నించగా ఫోన్లు లాగేసుకున్నారు. ఎస్ఆర్వో రాధిక పోలీసులకుసమాచారం ఇవ్వగా ఆమె ఫోన్ లాగేసుకొని బండరాయితో దాడి చేస్తుండగా తప్పించుకొన్నారు. సెక్షన్ అధికారి సాయికృష్ణ, ఇతర అధికారులకు
గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ రాజావెంకట్రెడ్డి, సీఐ సురేశ్, ఎన్హెచ్వి గంగాధర్లను చూసి దాడి చేసినవారు పారిపోయారు. గాయపడిన అటవీ అధికారులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన మోతీలాల్, అతని భార్య, తల్లి, హీరాలాల్, రత్యా, గణేశ్, బాలు, మరో 30 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఏహెచ్ల్వో పేర్కొన్నారు.

Related posts

Share via