AP: పోలీసులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ పోలీసుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయగా, చంద్రబాబు మంత్రితో ఫోన్లో మాట్లాడి వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా ఉండాలని, ఇలాంటి వైఖరిని సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.