June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

Medchal: బురఖాతో వచ్చి.. కత్తితో పొడిచి నగల దుకాణంలో దోపిడీకి యత్నం

బురఖా వేసుకుని ఒకడు.. హెల్మెట్తో మరొకడు వచ్చి ఓ బంగారు ఆభరణాల దుకాణ యజమానిని కత్తితో పొడిచి పట్టపగలే దోపిడీకి యత్నించారు.

యజమాని చాకచక్యంతో దుండగుల పలాయనం పట్టపగలే.. ఠాణాకు కూతవేటు దూరంలోనే ఘటన

మేడ్చల్, : బురఖా వేసుకుని ఒకడు.. హెల్మెట్తో మరొకడు వచ్చి ఓ బంగారు ఆభరణాల దుకాణ యజమానిని కత్తితో పొడిచి పట్టపగలే దోపిడీకి యత్నించారు. ఈ ఘటన మేడ్చల్ ఠాణాకు కూతవేటు దూరంలోనే గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాలివీ.. మేడ్చల్ లోని శ్రీ జగదాంబ జువెలర్స్ దుకాణంలోకి బైక్పై బురఖా వేసుకున్న ఒకడు, హెల్మెట్ ధరించి మరో దుండగుడు వచ్చారు. హిందీలో మాట్లాడారు. బురఖా ధరించిన వ్యక్తి యజమాని శేషారంను కత్తితో ఛాతిలో పొడిచాడు. మరో వ్యక్తి దుకాణంలో ఉన్న వెండి ఆభరణాలు, నగదు తీసి జేబులో పెట్టుకునే ప్రయత్నం చేశాడు. పక్కనే కూర్చున్న యజమాని కొడుకు సురేష్ భయపడి లోపలికి పరిగెత్తాడు. బంగారు ఆభరణాలు, నగదు బ్యాగులో వేయాలని దుండగులు బెదిరించారు. గాయపడిన శేషారం.. మీరే తీసుకోండి అంటూ ఆభరణాలను చూపిస్తూ చాకచక్యంగా ఇద్దరినీ నెట్టివేసి బయటకు పరిగెత్తాడు. దుకాణం బయటకు వెళ్లి.. చోర్ చోర్ అంటూ కేకలు వేశాడు. భయపడిన దుండగులు బయటకు పరుగుతీసి బైక్పై వెళ్లే క్రమంలో శేషారం కొడుకు కుర్చీతో వెనకనుంచి గట్టిగా కొట్టాడు. వాహనం అదుపు తప్పినా మళ్లీ తేరుకుని పారిపోయారు. ఈ క్రమంలో వారి చేతిలో నగదు, నగలు దుకాణంలోనే పడిపోయాయి. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సీఐ సత్యనారాయణతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు, చెకోపోస్టులను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

Also read వేరే గదిలో పడుకున్న భార్య.. ఉదయం భర్త లేచి చూడగా..

Related posts

Share via