మెదక్‌లో ఓనర్ కూతుర్ని సబీల్ అనే ఓ యువకుడు ప్రేమించాడనే కారణంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించి దారుణంగా బండరాయితో చంపి, ఆపై మగ్దుంపూర్ శివారులో నగ్నంగా సబీల్ డెడ్‌బాడీని పడేసి పరారయ్యారు.
మెదక్ జిల్లా శివంపేట మండలంలో దారుణ హత్య జరిగింది. ఓనర్ కూతుర్ని ప్రేమించాడనే కారణంతో సబీల్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లాకి చెందిన సబీల్ అనే యువకుడు ఓనర్ కూతురును ప్రేమించాడు. దీంతో బాలిక బంధువులు సబీల్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చారు. సబీల్ తలను గోడకు బలంగా గుద్ది.. బండరాయితో కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత డెడ్‌బాడీని నగ్నంగా పడేసి పరారయ్యారు.
ఇంటికి పిలిపించి మరి..
సబీల్ కారు పెయింటింగ్, డెంటింగ్ పనులు చేస్తుంటాడు. అయితే ఓనర్ కూతురు మైనర్ కావడంతో వారి పేరెంట్స్ ప్రేమను అంగీకరించలేదు. దీంతో సబీల్ అమ్మాయితో దిగిన ఫొటోలను బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. అప్పుడు అమ్మాయి బంధువులు మాట్లాడుకుందామని సబిల్‌ను ఇంటికి పిలిపించి హత్య చేశారు. చివరకు మగ్దుంపూర్ శివారులో సబిల్ డెడ్‌బాడీని నగ్నంగా పడేసి పరారయ్యారు.
ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న యువతి ఇష్టం లేని పెళ్లి సంబంధాలు చూస్తున్నారని బాధతో ఆత్మహత్య చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం.. చింతల యామిని (27) ఖమ్మం జిల్లాకు చెందిన ఈ యువతి.. గౌలిదొడ్డి ప్రాంతంలోని జేకే గ్రాండ్ హాస్టల్‌లో నివాసముంటూ గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసేది. కొన్ని రోజులుగా ఆమె మనోవేదనలో ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు.
ఘటన జరిగిన రోజు యామిని తన స్నేహితులకు ఖమ్మం వెళ్లుతున్నానని చెప్పింది. ఆ తరువాత ఆఫీసుకు వెళ్లిన ఆమె స్నేహితులు సాయంత్రం హాస్టల్‌కి తిరిగి వచ్చినప్పుడు ఆమె గదిలో నుంచి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ ద్వారా లోపల చూశారు. అప్పటికే ఆమె ఉరివేసుకొని చనిపోయినట్టు తెలుస్తోంది. వెంటనే ఈ విషాద వార్తను యామినికి దగ్గర కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025