శిర్డీ ఎక్సప్రెస్ లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also read :కొడవలి తో కొడుకు ఛాతి ని గాయపరిచిన తల్లిదండ్రులు
హైదరాబాద్ – : శిర్డీ ఎక్సప్రెస్ గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. బోగీల్లో సరైన భద్రత లేకపోవటంతోనే దొంగలు రెచ్చిపోయారని వాపోయారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది వివరాల ప్రకారం.. శిర్డీలో దర్శనం అనంతరం ఏపీ, తెలంగాణకు చెందిన భక్తులు గురువారం కాకినాడ పోర్ట్-సాయినగర్ శిర్డీ ఎక్స్‌ప్రెస్ రైల్లోని బి-4, బి-5, బి-6 బోగీల్లో కుటుంబసభ్యులతో సొంతూళ్లకు బయల్దేరారు. అర్ధరాత్రి దాటాక 1.30 – 2.30 గంటల మధ్య బోగీల్లోకి చొరబడ్డ దొంగలు ప్రయాణికుల విలువైన వస్తువులు చోరీ చేశారు. రైలు పర్లీ రైల్వేస్టేషన్ కు చేరుకున్న సమయంలో నిద్రలేచిన ప్రయాణికులు బంగారు నగలు, నగదు, సెల్ఫోన్లు ఇతర వస్తువులు కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించారు. టీటీలకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు సహాయ కేంద్రాలకు ఫోన్ చేసినా స్పందన రాకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. బీదర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఆపి ఆందోళన చేశారు. బి-4కోచ్‌లో ప్రయాణిస్తున్న తన హ్యాండ్ బ్యాగు చోరీకి గురైందని, అందులో 5 గ్రాముల డైమండ్ రింగు, ఇతర నగలు, వాచ్, యూఎస్ డాలర్లు ఉన్నాయని శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగిని ఫిర్యాదు చేశారు. దాదాపు 25 మంది ప్రయాణికులకు చెందిన 100 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, 20 సెల్ఫోన్లు పోయినట్లు బాధితులు తెలిపారు. నాందేడ్ ప్రాంతానికి చెందిన దొంగల ముఠా చోరీకి పాల్పడి ఉండొచ్చని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.
Also read :కొడవలి తో కొడుకు ఛాతి ని గాయపరిచిన తల్లిదండ్రులు
రాష్ట్రానికి రాలేననుకున్నా – మంత్రి లోకేశ్ సాయంతో ప్రాణాలతో తిరిగొచ్చా: గల్ఫ్ బాధితుడు వీరేంద్ర*
Nellore: విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
Tirupati: ఈ దంపతులిద్దరూ దేశముదుర్లు.. యువతికి గంజాయి అలవాటు చేసి.. ఆపై