SGSTV NEWS
Astro TipsAstrology

కుజుడు నక్షత్ర సంచారం.. మరో మూడు రోజుల్లో అదృష్టం పట్టే రాశులివే!



జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాలకు అధిపతి కుజ గ్రహం. ఇక కుజ గ్రహం అనుకూల స్థానంలో ఉంటే అనేక శుభఫలితాలు కలుగుతాయి. ఒక వేళ నీచ స్థానంలో ఉంటే చాలా కష్టాలు, నిందలు ఎదుర్కోక తప్పదు. ఇక గ్రహాల సంచారం అనేది చాలా కామన్. ప్రతి నెల లేదా ఆరునెలలకు ఒకసారి, కొన్ని గ్రహాలు సంవత్సరానికి ఒకసారి నక్షత్ర సంచారం లేదా రాశుల సంచారం చేస్తుంటాయి. అయితే త్వరలో కుజ గ్రహం నక్షత్ర సంచారం చేయనుంది.


నవగ్రహాల్లో ఒక్కటైన కుజ గ్రహం అక్టోబర్ 13వ తేదీన నక్షత్రసంచారం చేయబోతుంది. కుజ గ్రహం బలం, ధైర్యానికి, వాహనాలకు అధిపతి. కుజుడు ప్రస్తుతం స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అతి త్వరలో అంటే అక్టోబర్ 13వ తేదీన విశాఖనక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీని వలన మూడు రాశుల వారికి అనుకోని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
నవగ్రహాల్లో ఒక్కటైన కుజ గ్రహం అక్టోబర్ 13వ తేదీన నక్షత్రసంచారం చేయబోతుంది. కుజ గ్రహం బలం, ధైర్యానికి, వాహనాలకు అధిపతి. కుజుడు ప్రస్తుతం స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అతి త్వరలో అంటే అక్టోబర్ 13వ తేదీన విశాఖనక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీని వలన మూడు రాశుల వారికి అనుకోని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి కుజ గ్రహం నక్షత్ర సంచారం వలన అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న పనులన్నింటిని సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

ధనస్సు రాశి : కుజుడు నక్షత్ర మార్పు ధనస్సు రాశి వారికి అనేక లాభాలను తీసుకొస్తుంది. వీరు నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎవరైతే చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి జాబ్ దొరికే ఛాన్స్ ఉంది. అలాగే వీరికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. గత కొన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పానులన్నింటినీ పూర్తి చేస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.


సింహ రాశి : సింహ రాశి వారికి కుజ గ్రహం నక్షత్ర మార్పు కారణంగా  ఊహించని ప్రయోజనాలు అందిస్తాయి.  వీరు చాలా రోజుల నుంచి కలలు కంటున్న విదేశీ ప్రయాణానికి కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. ధనం పెరుగుతుంది. అప్పుల సమస్యలు తగ్గిపోతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.


అనుకోని మార్గాల ద్వారా ఆదాయం చేతికందడంతో చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం అద్భతంగా సాగిపోతుంది.

Also read

Related posts