గోదావరిఖని: ‘అమ్మా.. వద్దు వద్దు! నువ్వు ఏం జేస్తున్నవో నాకు తెలుస్తలేదు.. ఆ పని చేయొద్దమ్మా.. నాకు భయమేస్తుంది అమ్మా!’అని కూతురు వారిస్తున్నా వినకుండా ఓ వివాహిత, ఓ వ్యక్తితో వీడియోకాల్లో మాట్లాడుతూనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం ఈ ఘటన జరిగింది
పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన చొప్పరి అంజయ్య, మాధవి భార్యాభర్తలు. ఉపాధి కోసం వారు పదేళ్ల క్రితం గోదావరిఖని విఠల్నగర్కు వలస వచ్చారు. అంజయ్య సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. వీరికి ఏడేళ్ల వయసున్న రితిక అనే కూతురు ఉంది. తిలక్నగర్కు చెందిన సింగరేణి ఉద్యోగి ఎండీ యూసుఫ్ కుటుంబసభ్యులతో అంజయ్య, మాధవి కుటుంబానికి ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో యూసుఫ్ తరచూ వీరి ఇంటికి వచ్చివెళ్లేవాడు. మాధవి, యూసుఫ్ ఫోన్లో కూడా మాట్లాడుకునేవారు. అంజయ్య శనివారం ఉదయం సెంట్రింగ్ పనులు చేసేందుకు గోదావరిఖని సమీపంలోని సుందిళ్ల గ్రామానికి వెళ్లాడు. ఏం జరిగిందో ఏమోకానీ.. యూసుఫ్ వీడియోకాల్లో మాట్లాడుతూనే ఉదయం 10 గంటల సమయంలో మాధవి (30) ఉరివేసుకుంది. ఉరివేసుకుంటుండగా పక్కనే ఉన్న ఆమె కూతురు అమ్మా వద్దు వద్దు.. అని వారించినా వినలేదు. తన భార్య మరణం విషయంలో యూసుఫ్పై అనుమానంగా ఉందని మృతురాలి భర్త అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం