April 11, 2025
SGSTV NEWS
CrimeTelangana

పెళ్లై మూడు నెలలే అయింది.. కానీ ఆ సమస్యలతో వివాహిత బలవన్మరణం!



మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల రోషిణి మూడో అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లై మూడు నెలలే అయింది. కానీ ఆమెను అనారోగ్య సమస్యలు వెంటాడటంతో తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో ఏం చేయాలో అర్తం కాకా బలవన్మరణానికి పాల్పడింది

ఆమెకు పెళ్లైయి మూడు నెలలే అయింది. ఎంతో సంతోషంగా జీవించాలనుకుంది. కానీ ఈ క్రమంలోనే ఆమెను అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన ఆ వివాహితకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక ఊహించని నిర్ణయం తీసుకుంది. మూడో అంతస్తుపై నుంచి దూకి ఆమె సోమవారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రం ఏసీసీలో జరిగింది.


స్థానిక కృష్ణానగర్‌లో నివాసముంటున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ వాహనం డ్రైవర్‌ శ్రీనివాస్‌ తన కుమార్తె రోషిణి(22)కి ఇటీవల వివాహం చేశాడు. బెల్లంపల్లిలోని బూడిదగడ్డకు చెందిన గొడిసెల ప్రేమ్‌కుమార్‌తో ఆగస్టులో మ్యారేజ్ అయింది. అయితే రోషిణి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది

దీంతో పుట్టింటికి వెళ్తామని తన భర్తను అడిగింది. ఇందులో భాగంగానే గత నెల 27న భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. అక్కడ కొన్ని రోజులు బాగానే ఉంది. సోమవారం రోషిణి తెల్లవారుజామున ఉదయం 4.30 గంటలకు మూడో అంతస్తుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే రెండో అంతస్తులో ఉండే ధర్మాజీరాజు చూశాడు. పైకి ఎందుకు వెళ్తున్నావని అడిగాడు

నిద్రపట్టడం లేదని.. అలా కాసేపు పైకి వెళ్లి వస్తానని చెప్పింది. అనంతరం ఆమె బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కిందికి దిగి చూసే సరికి రోషిణి తీవ్రగాయాలతో ఉంది. వెంటనే మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచింది

Also read

Related posts

Share via