కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ ఎన్ఎన్ కాలనీలో
నివాసం ఉంటున్న వన్నాల రేవతి(27) బుధవారం ఇంటిలో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రేవతి భర్త కృష్ణారావు స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. సారవకోట మండలం
కుమ్మరిగుంటకు చెందిన కృష్ణారావుకు పాతపట్నం మండలం పాచిగంగుపేటకు చెందిన రేవతితో తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది.
అయితే ఎప్పటి మాదిరిగానే కృష్ణారావు విధుల నుంచి మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఇంటిలోకి వెళ్లే సరికి రేవతి ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించింది. దీంతో వెంటనే ఆమెకు కిందకు దించి స్థానికుల సహకారంతో స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వీరికి ఆరేళ్ల వయసు గల కుమార్తె ఉంది. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏంఏ ఆహ్మద్ తెలిపారు.
Also read
- కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
- Andhra: ఈ ఆలయానికి వెళ్లి మాల ధరిస్తే మద్యం అలవాటు మానేయాల్సిందే..!
- Vepa Puvvu Pachadi: వేప పువ్వును ఉగాది పచ్చడికే వాడుతున్నారా?.. ఈ రోటి పచ్చడి రుచి చూస్తే అస్సలు వదలరు!
- ఏది పట్టుకున్నా బంగారమే.. గురు బలంతో వారికి తిరుగే ఉండదు..!
- శని, శుక్రుల యుతి.. వారి జీవితాల్లో కలలో కూడా ఊహించని అనూహ్య మార్పులు..!





