వరంగల్ జిల్లా మనుగొండ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 60 ఏళ్ల వృద్ధుడు మైనర్‌ను గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కడుపు నొప్పిగా ఉందని ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది.
వరంగల్ జిల్లా గీసుకొండలో మైనర్‌పై అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు మైనర్‌పై దారుణానికి ఒడిగట్టాడు. మనుగొండ గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. వృద్ధుడు భార్య చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఆ గ్రామంలో వృద్ధుడు ఇంటికి దగ్గర ఉంటున్న ఆ బాలికను లొంగదీసుకుని చాలాసార్లు అత్యాచారం చేశాడు.
పరీక్షలు నిర్వహించగా..
మైనర్ బాలికకు కడుపు నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ఈ బండారం బయటపడింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆ బాలిక ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఈ విషయం బయటకు వచ్చింది. పలుమార్లు లొంగదీసుకుని తనపై అత్యాచారం చేశాడని బాలిక తల్లిదండ్రులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Also read
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





