SGSTV NEWS online
CrimeTelangana

తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ వ్యక్తి సూసైడ్ నోట్: తన భర్తను కాపాడాలంటూ భార్య ఆవేదన

తన చావుకు సీఐ, ఎస్ఐ కారణం.. సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైన వ్యక్తి   తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ సూసైడ్ నోట్(  రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

హైదరాబాద్‌ : తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన  సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తన దగ్గర అప్పు తీసుకున్నవారు తిరిగి ఇవ్వమంటే వేధిస్తున్నారని ప్రశాంత్‌ కుమార్‌ అనే వ్యక్తి హసన్‌పర్తి పోలీసులను  ఆశ్రయించాడు.

Suicide note



సీఐ తన సెల్‌ఫోన్‌, వాచీ లాక్కుకొని తనను తీవ్రంగా కొట్టారని ప్రశాంత్‌ ఆరోపించారు. పోలీసులు సమస్యను పరిష్కరించకపోగా తీవ్రంగా కొట్టడంతో దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. కాగా, తన భర్తను కాపాడి హసన్‌పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీకి బాధితుడి భార్య శ్యామల ఫిర్యాదు చేసింది. పోలీసుల దౌర్జన్యం వల్లే అవమాన భారం తట్టుకోలేక అదృశ్యమయ్యాడని పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*తన చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ వ్యక్తి సూసైడ్ నోట్: తన భర్తను కాపాడాలంటూ భార్య ఆవేదన*

Also read

Related posts