హైదరాబాద్…భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను, ఏడాది వయసు కూడా లేని బిడ్డను కడతేర్చి.. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు.

హైదరాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించి బేగంపేట్ ఏసీపీ గోపాలకృష్ణ, బోయిన్పల్లి ఎస్సై శివశంకర్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని మార్టోలి తాలూకా డెగ్లూరుకు చెందిన కోలూరె గణేశ్ సంగ్రామ్ (35) వృత్తిరీత్యా డ్రైవరు. మూడేళ్లుగా అతను భార్య స్వప్న (30), ఆరేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు త్రివేణి, తనుశ్రీలతో కలిసి న్యూబోయిన్పల్లి పెద్దతోకట్టలో నివాసం ఉంటున్నాడు. 11 నెలల క్రితం వీరికి మరో కుమార్తె నక్షత్ర జన్మించింది. గణేశ్ సంగ్రామ్ కూరగాయలను తరలించే ఆటోను నడుపుతుండగా, స్వప్న ఇంటివద్దే ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటోంది. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని గణేశ్ కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ అనుమానం మరింత ఎక్కువై.. ఆదివారం తెల్లవారుజామున నేలపై నిద్రిస్తున్న భార్యతోపాటు ఊయలలో నిద్రపోతున్న పసిపాప నక్షత్రను తాడుతో గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం గణేశ్ ‘100’కు ఫోన్చేసి తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నందున ఆమెతోపాటు కుమార్తెను హత్య చేశానని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ చిరునామా చెప్పి ఫోన్ కట్ చేశాడు. అనంతరం అమ్ముగూడ-సనత్నగర్ రైల్వేస్టేషన్ల మధ్య సుచిత్ర ప్రాంతంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఆ ఇంటికి చేరుకుని చూసేసరికి స్వప్న, నక్షత్రలు విగతజీవులుగా పడిఉన్నారు. తనుశ్రీ అప్పుడే నిద్రలేచి కూర్చొని ఉండగా, త్రివేణి ఇంకా నిద్రలోనే ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం మృతుడి సోదరుడు సంజయ్కు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read :Crime News: స్నానాల గదిలో.. తల్లి, తండ్రి, కుమారుడి మృతి
పల్నాడు జిల్లా.*కలెక్టర్ సీసీ జానీ బాషా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళ ఆరోపణ*..వీడియో
AP News: అయ్యో భగవంతుడా.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తే..