April 11, 2025
SGSTV NEWS
Andhra PradeshCrimeViral

Andhra Pradesh: వామ్మో.. వీడు పోలీసులను చూస్తే సైకోలా మారతాడట.. పాపం ఆ హెడ్ కానిస్టేబుల్

పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాళింది పోలీసు యూనిఫామ్‌లను చూస్తే.. పేట్రోగిపోతాడు. చేతిలో ఏది ఉంటే.. దానితో దాడి చేస్తాడు. గతంలో కూడా అతను పోలీసులపై ఇలానే దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Also read :Tirumala: తిరుమలలో కల్తీ ఫుడ్ కలకలం.. పలు హోటళ్లని తనిఖీ చేసిన ఈవో.. నాణ్యతలేని వస్తువులు, పాడైన కూరగాయలను చూసి షాక్‌

తిరుపతి జిల్లా గూడూరులోని సాధుపేట సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పై వెనుక నుండి కర్రతో దాడి చేయడం కలకలం రేపింది. దాడి తాలూకా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రాథమిక విచారణలో నిందితుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన లాల్తు కాళిందిగా గుర్తించారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. యూనిఫాంలో ఉన్న పోలీసులను చూడగానే.. అతను సైకోలా మారతాడని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. గాయపడిన హెడ్ కానిస్టేబుల్ స్వామి దాస్‌గా తెలిసింది. ఆయన గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. దుండగుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన్ను వెంటనే గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరువాత అతన్ని అధునాతన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

వీడియో…

Also read :Andhra Pradesh: ‘పిల్లలూ.. మీరు అల్లరి చేస్తే నేను చచ్చిపోతా..!’ బెదిరిద్దామనుకున్నాడు.. కానీ అంతలోనే..

Andhra Pradesh: తిరుపతిలో ఒకే కుటుంబంపై కత్తులతో దాడి.. వృద్ధురాలు మృతి, బాలిక సీరియస్..!

Related posts

Share via