జ్యోతిషశాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 2025 నెల కొన్ని రాశులకు చాలా ప్రత్యేకమైనదిగా ఉండనుందని తెలుస్తుంది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగాలు కొన్ని రాశుల వారి అదృష్టాన్ని ప్రకాశింపజేయబోతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు ఈ యోగాల తర్వాత అదృష్టం ప్రకాశించే ఆ అదృష్ట రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.
జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారము, వాటి సంయోగం జీవితంలో పెద్ద మార్పులను తెస్తాయి. 50 సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ నెలలో అరుదైన యాదృచ్చికం జరగబోతోంది. ఈ సమయంలో, శుక్రుడు తన సొంత రాశి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మాలవ్య రాజ్యయోగాన్ని సృష్టిస్తుంది. దీనితో పాటు బుధుడు, సూర్యుడి కలయిక ద్వారా బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ రెండు శుభ యోగాలు కలిసి ఏర్పడటంతో రానున్న సమయం మకరం, కుంభం, తుల ఈ మూడు రాశుల వారికి ఆర్థికంగా మంచి ఫలితాలను తీసుకుని వచ్చే అవకాశం ఉంది.
మాలవ్య రాజయోగం అంటే ఏమిటి? జ్యోతిషశాస్త్రంలో పంచ మహాపురుష యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వీటిలో ఒకటి మాలవ్య రాజ్యయోగం. శుక్ర గ్రహం కేంద్ర భావంలో (మొదటి, నాల్గవ, ఏడవ లేదా పదవ ఇల్లు) దాని ఉచ్ఛ రాశి మీన రాశిలో లేదా దాని సొంత రాశి వృషభం, తులారాశిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది.
సెప్టెంబర్‌లో శుక్రుడు తన సొంత రాశి తులారాశిలో సంచరించడం వల్ల ఈ రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడిని సంపద, శ్రేయస్సు, ప్రేమ, కళ,విలాసాలకు కారకుడిగా పరిగణిస్తారు. కనుక ఈ యోగ ప్రభావం వల్ల, ఒక వ్యక్తి జీవితంలో భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
బుధాదిత్య రాజయోగం అంటే ఏమిటి? సూర్యుడు, బుధుడు ఒకే ఇంట్లో కలిసినపుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. సూర్యుడిని గ్రహాలకు రాజుగా , ఆత్మకు కారకుడిగా భావిస్తారు. అయితే బుధుడిని తెలివి, వ్యాపారం, వాక్కుకు కారకంగా భావిస్తారు.
ఈ రెండు గ్రహాల కలయిక చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ యోగా ప్రభావం వల్ల ఒక వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుంది. అతని తెలివితేటలు పదునుగా మారతాయి. వ్యాపారం, వృత్తిలో పురోగతి సాధిస్తాడు.
ఏ 3 రాశుల వారు ఎక్కువగా ప్రభావితమవుతారంటే
మకర రాశి: ఈ సమయం మకర రాశి వారికి చాలా ఫలవంతమైనదిగా నిరూపించబడుతుంది. మాలవ్య రాజ్యయోగ ప్రభావం వల్ల జీవితంలో సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. వీరు ఆఫీసులో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. జీతం పెరగవచ్చు. బుధాదిత్య రాజ్యయోగం కారణంగా వ్యాపారస్తులు వ్యాపారంలో పెద్ద ఒప్పందాలను పూర్తి చేస్తారు. ఆర్థిక లాభానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
కుంభ రాశి: కుంభ రాశి వారికి ఈ రెండు రాజయోగాల నుంచి ఊహించని ధన లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించవచ్చు. ఈ సమయం వ్యాపారవేత్తలకు లాభాలతో నిండి ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. దీనితో పాటు కుటుంబ జీవితంలో కూడా ఆనందాన్ని పొందుతారు. సంబంధాలలో మాధుర్యం ఉంటుంది.
తులా రాశి: ఈ సమయం తుల రాశి వారికి ఒక వరం లాంటిది ఎందుకంటే శుక్రుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాలవ్య రాజ్యయోగం కారణంగా వీరి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. బుధాదిత్య రాజ్యయోగ ప్రభావం వల్ల వీరి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. పెండింగ్ పని పూర్తవుతుంది. అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!