దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో కేరళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పీఠాధిపతిగా మారి వ్యాపారవేత్త అయిన ఉన్నికృష్ణన్ పొట్టిని శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో కేరళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పీఠాధిపతిగా మారి వ్యాపారవేత్త అయిన ఉన్నికృష్ణన్ పొట్టిని శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ బృందం, క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ నేతృత్వంలో గురువారం ఉదయం నుండి కిలిమనూరు సమీపంలోని ఉన్నికృష్ణన్ నివాసంలో దాదాపు 11 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారణ జరిపింది. అనంతరం, శుక్రవారం తెల్లవారుజామున అతని అరెస్టును లాంఛనంగా నమోదు చేసింది. వైద్య పరీక్షల నిమిత్తం తిరువనంతపురం జనరల్ ఆసుపత్రికి తరలించిన తర్వాత, అతడిని పతనంతిట్టలోని రాన్నీ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు.
శబరిమల సన్నిధానంలోని శ్రీకోవిల్ (గర్భగుడి) ద్వారపాలకుల విగ్రహాలు, గడపకు బంగారు తాపడం పనులు చేయించినప్పుడు 475 గ్రాముల (సుమారు 56 సవర్ల) బంగారం అపహరణకు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. 2019లో జరిగిన ఈ మరమ్మత్తుల కోసం బంగారు పూత పూయడానికి అప్పగించిన కళాకృతుల్లో 4.5 కిలోల బరువు తగ్గడాన్ని దేవస్వం విజిలెన్స్ అధికారి నివేదికలో గుర్తించారు.
బంగారు తాపడానికి కేవలం 3 గ్రాముల బంగారం మాత్రమే వాడి, మిగిలిన మొత్తాన్ని పొట్టి దుర్వినియోగం చేశాడని దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు ఉన్నికృష్ణన్ పొట్టిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. విచారణలో పొట్టి మరిన్ని సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ చోరీ గురించి ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) అధికారులకు ముందే తెలుసని, దొంగిలించిన బంగారాన్ని టీడీబీ సభ్యులు పంచుకున్నారని అతను ఆరోపించినట్లు సమాచారం. ఈ అరెస్టుతో కేరళ రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర దేవస్వం శాఖ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ కేసులో మరిన్ని అరెస్టులు, కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో