February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Crime  News: హత్యచేసి పాతిపెట్టి.. పక్కనే పొయ్యి పెట్టి..!



వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టారు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా.. పాతిపెట్టిన స్థలాన్ని పేడతో అలికారు. దాని పక్కనే పొయ్యి పెట్టి వంట చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో జరిగిన ఘటన

నెహ్రూసెంటర్ (మహబూబాబాద్):వివాహితను హత్య చేసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టారు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా.. పాతిపెట్టిన స్థలాన్ని పేడతో అలికారు. దాని పక్కనే పొయ్యి పెట్టి వంట చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్కాలనీలో జరిగిన ఘటన ఇది. ఆ ఇంట్లోని చిన్నారులు స్థానికులకు చెప్పడంతో ఈ నేరం వెలుగుచూసింది. మహబూబాబాద్ పట్టణ సీఐ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాటి రాములు, లక్ష్మి, వారి కుమారుడు గోపి, కుమార్తె దుర్గ, అల్లుడు మహేందర్ సిగ్నల్కాలనీకి చెందిన అంజయ్య ఇంట్లో మూడేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. పట్టణంలో కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. బయ్యారం మండల లక్ష్మీనర్సింహాపురం గ్రామానికి చెందిన నాగమణి (35) తో కొన్ని నెలల క్రితం గోపీకి పరిచయం ఏర్పడింది. అప్పటికే వివాహమై ఇద్దరు కుమారులున్న నాగమణి వారిని వదిలి గోపీతో కలిసి రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఉంటున్నారు. కొన్నిరోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గోపి, లక్ష్మి, రాములు, దుర్గ పది రోజుల క్రితం నాగమణిని హత్యచేసి అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోనే పూడ్చేసినట్లు అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి. విషయం బయటకు పొక్కకుండా పేడతో అలికి పూడ్చిపెట్టిన స్థలంలోనే పొయ్యిపెట్టి వంట చేసుకోవడం గమనార్హం. దుర్గ కుమార్తెల ద్వారా విషయం బయటకు పొక్కడంతో స్థానికులు గత మంగళవారం మహబూబాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితులు పరారయ్యారు. ఇంటి యజమాని వచ్చేదాక వేచిచూసి గురువారం పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.

Also read

Related posts

Share via