April 4, 2025
SGSTV NEWS
Spiritual

Maha Shivratri 2025 Panch Kedar Yatra: పంచారామాలు, పంచభూత లింగాలు మాత్రమే కాదు..పంచకేదార క్షేత్రాల గురించి తెలుసా!


Maha Shivratri 2025: అమ్మవారి శరీర భాగాలు పడినవి అష్టాదశ శక్తిపీఠాలు అయితే.. పరమేశ్వరుడి శరీర భాగాలు పడిన ప్రదేశాలు పంచకేదార క్షేత్రాలు అని పిలుస్తారు. అవెక్కడున్నాయో చూద్దాం…

Panch Kedar Yatra: కురుక్షేత్ర యుద్ధం పూర్తైన తర్వాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం, దాయాదులు, బంధువులను చంపిన పాపాన్ని పోగొట్టుకునేందుకు  శివుడి దర్శనానికి వెళ్లారు. అయితే శంకరుడు మాత్రం పాండవులకు తన దర్శనభాగ్యం కల్పించలేదు. ఆ క్షణంలో కాశీని వదిలి ఉత్తరదిశగా ఉన్న హిమాలయాలకు వెళ్లిపోతాడు. పట్టువదలని పాండవులంతా శివుడి దర్శనం కోసం తిరుగుతుంటారు. అలా వెతుకుతూ వెతుకుతూ  నందిరూపంలో ఉన్నాడని గుర్తిస్తారు. ఆ నందిని పట్టుకునేందుక భీముడు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో మాయమైన శివుడు శరీర భాగాలు ఐదుచోట్ల ప్రతిష్ఠితమై  పుణ్య క్షేత్రాలుగా వెలుగుతున్నాయి. శివపురాణం ప్రకారం వీటినే పంచకేదారాలుగా చెబుతారు

1.కేదార్నాథ్
2.తుంగనాథ్
3.రుద్రనాథ్
4.మహేశ్వర్
5.కల్పనాథ్

కేదార్నాథ్

పంచకేదారాల్లో మొదటిది, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కేదార్నాథ్ క్షేత్రం. పాండవులకు అందకుండా మాయమైన నందిగా మారిన పరమేశ్వరుడి  మూపురభాగం పడిన ప్రదేశం ఇది. ఇక్కడ శివలింగం 8 గజాల పొడవు, 4 గజాల ఎత్తు, 4 గజాల వెడల్పు ఉంటుంది. త్రిభుజాకారంలో దర్శనమిస్తాడు శివుడు. పాండవులు స్వర్గలోకానికి నడక మార్గం ప్రారంభించిన ప్రదేశం ఇదే అని పురాణకథనం.


తుంగనాథ్

పంచ కేదారాల్లో రెండోది తుంగనాథ్. ముక్కంటి రెండు చేతులు పడిన ప్రాంతాన్ని తుంగనాథ్ అని పిలుస్తారు. అందుకే పరమేశ్వరుడు చేతుల అడుగు ఎత్తులో లింగరూపంలో వెలసిన క్షేత్రం ఇది. ఈ ఆలయానికి కుడివైపు పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. ఈ పంచకేదార నమూనాలను అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెబుతోంది

రుద్రనాథ్

పంచ కేదార క్షేత్రాల్లో మూడో క్షేత్రం రుద్రనాథ్. శివుడి ముఖభాగం వెలసిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ శివలింగం నంది రూపంలో ఉంటుంది. రోజూ తెల్లవారు జామున స్వామివారికి వెండి తొడుగు తొలగిస్తారు. ఈ ఆలయానికి వెనుక ప్రవహించే నది వైతరిణీ. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే పూర్వీకులకు మోక్షం కలుగుతందని భక్తులకు విశ్వాసం.

మహేశ్వర్

పంచ కేదారాల్లో నాలుగోది మహేశ్వర్ క్షేత్రం. విశ్వనాథుడి నాభి భాగం పడిన ప్రదేశం ఇది.  గుప్తకాశీకి 24 మైళ్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని భీముడు నిర్మించాడు. ఈ స్వామిని దర్శించుకుంటే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

కల్పనాథ్

పంచ కేదారాల్లో చివరిది కల్పనాథ్ క్షేత్రం. ఇక్కడ పరమేశ్వరుడి  ఝటాజూట భాగమే లింగ రూపంలో వెలిశాడిని స్థలపురాణం. అడవి మధ్యలో ఉన్న చిన్న గుహలో వెలసిన స్వామిని ఝుటేశ్వర్ మహదేవ్ అని పిలుస్తారు..పూజిస్తారు



బిల్వాష్టకం
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం

Also read

Related posts

Share via