February 24, 2025
SGSTV NEWS
Spiritual

మాఘ పూర్ణిమ – మహా మాఘి మాఘ పూర్ణిమ ప్రత్యేకత, విశిష్టత ఏమిటి?

మాఘ పూర్ణిమ అంటే ఏమిటి ?


తెలుగు నెలల్లో ప్రతి నెలకూ ఓ ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం దీపారాధనలకు ప్రసిద్ధి అయినట్టే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. ఈ నెల మొత్తంమీద మాఘ పౌర్ణమి ఇంకా ప్రత్యేకం. మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి సనాతన ధర్మంలో విశేష ప్రాధాన్యం ఉంది. మాఘమాసంలో వస్తుంది కాబట్టి దీనిని మాఘీ పూర్ణిమ మరియు మహామాఘి అని కూడా అంటారు.ఈ మహామాఘి శివ , కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. ఈ పర్వదినాన ప్రవహించే నదిలో సూర్యోదయానికి ముందు స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ సమయంలో సూర్యుడు మకరం నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. ఈ కాలంలో పవిత్ర నదిలో స్నానం చేసి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి, దానధర్మాలు చేయాలని పండితులు చెబుతారు.


మాఘ పూర్ణిమ ప్రత్యేకత


దేవతలు మాఘమాసంలో పౌర్ణమి రోజున భూమికి దిగివచ్చి పవిత్రమైన గంగా నదిలో స్నానం చేస్తారని నమ్ముతారు. ఫలితంగా, ఈ రోజు ప్రయాగ్‌రాజ్‌లో గంగాస్నానం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ రోజుల్లో నదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది.


స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన శ్లోకం

“దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ”


అంటే “”దుఃఖములు , దారిద్య్రము నశించుటకు పాప క్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాన అనుగ్రహించు” అని అర్థం.

స్నానం తర్వాత పఠించాల్సిన శ్లోకం


“సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ
త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా”

అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే “ఓ పరంజ్యోతి స్వరూపుడా! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు నశించుగాక” అని అర్థం. మాఘస్నానం చేసిన తర్వాత, పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని, ఇష్టదైవాన్ని ఆరాధించాలి.


పౌర్ణమి రాత్రి పూజించడం ద్వారా డబ్బుకు కొరత ఉండదు. మాఘ పూర్ణిమ రోజున, మీరు . మాఘ పూర్ణిమ రోజున, శ్రీ కృష్ణ భగవానుడు తెల్లటి పువ్వులు, ప్రకాశవంతమైన వస్త్రాలు, గులాబీలు, ముత్యాలు, పండ్లు, బియ్యం మరియు ఖీర్ లేదా తెలుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా సమర్పిస్తే ఆశీర్వదిస్తాడు. మాఘ పూర్ణిమ నాడు పెద్ద దీపం తీసుకుని, అందులో స్వచ్ఛమైన నెయ్యి, నాలుగు లవంగాలు వేసి, దీపం వెలిగిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. మాఘ పౌర్ణమి రోజు దానాలు చేస్తే మరింత ఫలితాన్ని ఇస్తాయి.

Related posts

Share via