SGSTV NEWS online
CrimeTelangana

మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు రోడ్డు ప్రమాదం.. పెద్ద కుమార్తె పరిస్థితి విషమం!


దివంగత నేత మాగంటి గోపీనాథ్ కుమార్తెలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది

హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మాగంటి పెద్ద కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. రెండో కుమార్తె గాయాలతో బయటపడ్డారు. ఇద్దరూ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గచ్చిబౌలి సమీపంలో ప్రయాణించే సమయంలో వీరి ఫార్చ్యూనర్.. కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. ఆ తర్వాత ప్రమాదం జరిగింది. ఈ సమయంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశర అందులోనే ఉన్నారు. అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రతతో కారు దెబ్బతిన్నది. స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో పెద్ద కుమార్తె అక్షర తలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో కుమార్తె దిశర స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం బాధితులిద్దరినీ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also read

Related posts