మనుషులు మనుషులం అనే విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. మార్చురీలో మహిళ మృతదేహంపై లైంగిక దాడి జరిగింది.
మనుషులు మనుషులం అనే విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. మార్చురీలో మహిళ మృతదేహం పై లైంగిక దాడి జరిగింది. ఏడాదిన్నర తర్వాత సీసీఫుటేజీతో ఈ దారుణం బయటపడింది. బుర్హాన్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరగగా.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
స్ట్రెచర్‌పై ఉన్న మృతదేహాన్ని
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మార్చురీలో ఉన్న మహిళ మృతదేహం ఉండగా.. స్ట్రెచర్‌పై ఉన్న మృతదేహాన్ని పక్కకు లాక్కెళ్లి నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2024 ఏప్రిల్ 18న సాయంత్రం సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రెండ్రోజుల క్రితం పోలీసులకు ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదు చేయడంతో నిందితుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నీలేష్ భిలాలా(25) అరెస్ట్ చేశారు.
అయితే ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు అనేది ఇప్పడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. కాగా.. సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





