హైదరాబాద్‌లోని ఎంఎల్ఏ కాలనీకి చెందిన వైష్ణవికి నాగారం ప్రాంత ఉమాపతికి మధ్య ప్రేమ చిగురించింది. రహస్యంగా పెళ్లి చేసుకున్న ఉమాపతి ఆమె డబ్బులతో జల్సా చేశాడు. దాదాపు రూ.1.25కోట్లు తీసుకున్నాడు. ఉమాపతి ఆగడాలు భరించలేక వైష్ణవి పోలీసులకు ఫిర్యాదు చేసింది
ప్రేమ ఎప్పుడు, ఎవరిపై, ఎందుకు పుడుతుందో తెలీదు. కాస్త పరిచయానికే ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ పెంచుకుంటారు. ఒకరిపై ఒకరు కేరింగ్‌గా ఉంటారు. చివరిగా వారు అనుకున్నది దక్కించుకున్నాక వదిలించుకోవడానికి చూస్తారు. తాజాగా అలాంటిదే జరిగింది.
పరిచయం కాస్త ప్రేమగా
హైదరాబాద్‌లోని ఎంఎల్ఏ కాలనీలో నివాసముంటున్న వైష్ణవికి.. నాగారం ప్రాంతానికి చెందిన ఉమాపతి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి ఉమాపతిని ఎంతో ఘాడంగా ప్రేమించింది.కానీ ఉమాపతి మాత్రం వైష్ణవిని ప్రేమ పేరుతో ఆమె వెనుకున్న డబ్బుల కోసం వల వేశాడు.
ఫొటోలు బయటపెడతా
అలా ఇద్దరూ కొద్ది రోజులు ఎంజాయ్ చేశారు. ఓ రోజు వైష్ణవిని బెదిరించాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే ప్రైవేట్ ఫొటోలు బయటపెడతానంటూ బెదిరించాడు. ఆపై వైష్ణవిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు. అనంతరం విదేశాలకు వెళ్లేందుకు డిపెండెంట్ వీసా కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. యూకే వెళ్లి ఆ యువతి డబ్బులతో బాగా ఎంజాయ్ చేశాడు.
ఆమెనుంచి దాదాపు రూ.1.25 కోట్లు తీసుకుని వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఉమాపతి ఆగడాలు సహించలేక ఓ రోజు ప్రశ్నించగా.. అప్పటి నుంచి వైష్ణవిని టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా అట్రాసిటీ కేసు పెట్టించి జైలుకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.
కేసు నమోదు
ఇక ఉమాపతి ఆగడాలతో చిర్రెత్తిపోయిన వైష్ణవి వెంటనే ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలు చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఉమాపతి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025