November 21, 2024
SGSTV NEWS
Lifestyle

Nandivardhanam: ఈ నందివర్థనం పూలతో ఉండే బెనిఫిట్స్ ఊహించనవి.. షాక్ అవ్వక తప్పదు..

నంది వర్థనం పూల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే కొంత మందికి పేరు తెలియక పోయినా ఈ పూలను చూసే ఉంటారు. ఈ నంది వర్థనం పూల మొక్క చిన్నది వేసినా.. వృక్షంలా ఎదుగుతుంది. ఈ పూలలో చాలా రంగులు ఉన్నాయి. ఎక్కువగా తెలుపు రంగు కనిపిస్తూ ఉంటుంది. దేవతార్చనకు ఈ పూలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పూలు చూడటానికి కూడా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కేవలం పూజలకు..


నంది వర్థనం పూల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే కొంత మందికి పేరు తెలియక పోయినా ఈ పూలను చూసే ఉంటారు. ఈ నంది వర్థనం పూల మొక్క చిన్నది వేసినా.. వృక్షంలా ఎదుగుతుంది. ఈ పూలలో చాలా రంగులు ఉన్నాయి. ఎక్కువగా తెలుపు రంగు కనిపిస్తూ ఉంటుంది. దేవతార్చనకు ఈ పూలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పూలు చూడటానికి కూడా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కేవలం పూజలకు మాత్రమే కాకుండా ఈ పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా మొక్కల ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఈ మొక్కను కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇంత అందంగా కనిపించే ఈ పూలతో ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కంటి సమస్యలు దూరం:
ప్రస్తుత కాలంలో కంటి సమస్యలతో ఇబ్బంది పడేవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతూనే ఉంది. ఎక్కువగా కంప్యూటర్ వర్క్ చేయడం, సెల్ ఫోన్స్, టీవీలు చూడటం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కళ్ల సమస్యలు వస్తున్నాయి. కళ్లపై కూడా ఒత్తిడి అనేది ఎక్కువగా పడుతుంది. ఎలాంటి కంటి సమస్యలను అయినా దూరం చేసే శక్తి ఈ పూలకు ఉంది. కంటి చూపును కూడా మెరుగు పరుస్తాయి.

నీళ్లలో ముంచిన తర్వాత ఈ పూలను కంటి రెప్పలపై కనీసం 10 నిమిషాలు అయినా అలాగే ఉంచండి. ఇలా చేయడం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది, కంటి నొప్పి, ఎర్రడటం నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. కళ్లు ఫ్రెస్‌గా కనిపిస్తాయి. ఇలా అప్పుడప్పుడూ చేయండి.


గాయాలు దూరం:
అప్పుడప్పుడూ అనుకోకుండా గాయాలు తగులుతూ ఉంటాయి. ఒక్కోసారి గాయాలు త్వరగా మానవు. అలాంటి సమయంలో ఈ మొక్క నుంచి వచ్చిన పాలను గాయాలపై పూయండి. ఇలా చేయడం వల్ల గాయం త్వరగా నయమవుతుంది. నంది వర్థంన చెట్టు, ఆకులు, పువ్వులు, వేర్ళుల అన్నింట్లో కూడా మంచి ఔషధ గుణాలు లభిస్తాయి.

లైంగిక సామర్థ్యం:
మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో కూడా ఈ పూలు ఎంతో చక్కగా పని చేస్తాయి. ఈ చెట్టు వేర్ల పొడిని పాలలో లేదా గోరు వెచ్చటి నీటిలో కలిపి తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే రక్త పోటు, షుగర్ వ్యాధిలు కూడా కంట్రోల్ అవుతాయి.

Related posts

Share via