November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

సమాజ అసమానతలు పోయేందుకు కృషి చేద్దాం……పామర్తి సత్య, ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యులు.

సమాజ అసమానతలు పోయేందుకు కృషి చేద్దాం……పామర్తి సత్య, ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యులు.

        సత్య శోధక్ సమాజ్ 152 వ ఆవిర్భావ వారోత్సవాల లో భాగంగా నిడదవోలు బ్రాహ్మణ గూడెం రోడ్ లోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలు నందు ఐ.యఫ్.టి.యు అనుబంధ గౌతమి ఎలక్ట్రికల్ _ ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ. అధ్యక్షత వహించిన యూనియన్ ప్రెసిడెంట్, ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యులు పామర్తి సత్య. ఆయన మాట్లాడుతూ 152 సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే “సత్య శోధక్ సమాజ్” స్థాపించి నాటి సమాజంలో వున్న ఆర్ధిక, సాంఘిక, సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలు, స్త్రీ అవిద్య, తదితర అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తూ, పోరాడుతూ, స్వయం గా తన భార్య కు చదువు నేర్పి , మహిళలకు పాఠశాల స్థాపించిన సామాజిక విప్లవ కారుడు న్నారు.
ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ దేశంలో రోజురోజుకీ కులం, మతం పేరిట దాడులు నిత్య కృత్యాలయ్యాయనీ, మను వాద వారసులైన ఆర్.యస్.యస్ , బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులు, ఆదివాసులు, మహిళలు, మైనారిటీల ఊచకోతలు అధికమవ్వడమేకాక వివిధ సంఘటనల్లో దోషులుగా శిక్షలు పడ్డ వారుకూడా నిర్దోషులుగా విడుదలవుతున్నారనీ, ఆర్.యస్.యస్ శక్తులు వారికి సన్మానం , ఊరేగింపు లు చేస్తున్నారనీ, బిల్కిస్ భాను, కశ్మిర్(కథువా) సంఘటనలే ఇందుకు నిదర్శనమనీ, పాలకవర్గాలు అండతోనే కారంచేడు, చుండూరు, నీరు కొండ, పదిరి కుప్పం, లక్ష్మింపేట, పిప్పర, ఉనా(గుజరాత్) తదితర అనేక సంఘటనలు పునరావృతం అవుతూనే వున్నాయి నీ, కుల,మతం,లింగ , ఆర్ధిక వివక్ష లు, అంటరానితనం నేటికీ రాజ్యమేలుతున్న నేపధ్యంలో 152 సంవత్సరాల క్రితమే ప్రారంభించబడిన సతయశోధక్ సమాజ్ ఆశయాలు నేటికీ నెరవేరని కారణంగా పూలే-సావిత్రి బాయి ఆశయాలు, ఆచరణ కొనసాగించాలని పిలుపునిచ్చారు.
        పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు మల్లిడి వెంకట రామిరెడ్డి, మహమ్మద్ ఆలీ, కోదాటి శ్రీనివాస్, ఆనంద్ తదితరులు నాయకత్వం వహించారు.

Also read

Related posts

Share via