38 ఏళ్ల వివాహితను బ్లాక్ మెయిల్ చేసి వేధించినందుకు ఎన్ఆర్ఐ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నిందితుడిని నౌషాద్ అబూబకర్‌గా గుర్తించారు. నిందితుడితో విసిగిపోయిన వివాహిత జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
38 ఏళ్ల మహిళను బ్లాక్ మెయిల్ చేసి వేధించినందుకు ఎన్ఆర్ఐ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నిందితుడిని నౌషాద్ అబూబకర్‌గా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జూబ్లీ హిల్స్‌కు చెందిన 38 ఏళ్ల వివాహిత ఆరు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లింది. అక్కడ ఓ పబ్ లో రెండు సంవత్సరాలుగా డాన్సర్ గా పనిచేసింది. ఈ క్రమంలో ఆమెకు 38 ఏళ్ల నౌషాద్ అబూబకర్‌తో పరిచయం ఏర్పడింది.
నౌషాద్ అబూబకర్ వేధింపులు
దీంతో ఇద్దరు స్నేహితులుగా మారారు. ఆ తరువాత ఆ వివాహిత హైదరాబాద్ కు తిరిగి వచ్చేసింది. అయితే కాస్త చనువుతో ఆమెతో తనతో దిగిన ఫోటోలను బెదిరిస్తూ ఫోన్లు చేశాడు నౌషాద్ అబూబకర్. అలా చేయవద్దని వివాహిత వేడుకుంది. అయినప్పటికీ నౌషాద్ అబూబకర్ వేధింపులు ఆగలేదు. దీంతో ఆ వివాహిత మరోమారు దుబాయ్ కు వెళ్లి అతన్ని కలిసి వేడుకుంది. దీనికి నౌషద్ ఫోటోలు, వీడియోలను తొలగిస్తానని ఆమెకు చెప్పాడు
నీ భర్త, పిల్లల్ని వదిలేసి.. నన్ను పెళ్లి చేసుకో
దీంతో ఆమె తిరిగి హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. కొద్దీరోజులు బాగానే ఉన్న మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. హైదరాబాద్ కు వచ్చిన నౌషాద్ అబూబకర్ వివాహితకు ఫోన్ చేసి నీ భర్త, పిల్లలను విడిచిపెట్టి తనను వివాహం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. నిరాకరిస్తే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని కూడా బెదిరించాడు. దీంతో విసిగిపోయిన వివాహిత మార్చి 20 గురువారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎన్ఆర్ఐని అదుపులోకి తీసుకున్నారు
Also read
- ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!
- Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
- Tirumala Laddu Case: కీలక సూత్రధారులు వారే.. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు..
- Andhra Pradesh: ఇన్‌స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే..
- బయటనుంచి చూస్తే రేకుల షెడ్డు.. లోపలికెళ్తే మైండ్ బ్లాక్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





