చెన్నై:ప్రియుడిని వెతుక్కుంటూ బయలుదేరిన ఓ 13 ఏళ్ల బాలిక పోలీసుల చేతిలోనే లైంగికదాడికి గురైంది. కాపాడాల్సిన పోలీసే ఆ బాలిక జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఇటీవల జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన బాయ్ఫ్రెండ్ మాటలు నమ్మి ఓ బాలిక ఇంటి నుంచి పారిపోయి బయటికి వచ్చింది.
రాత్రి వేళ కావడంతో రోడ్డు పక్కన ఫుట్పాత్పై నిద్రపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలీసు రామన్ సాయం చేస్తానని బాలికను జీపు ఎక్కించుకున్నాడు. వాహనంలోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి ట్రాఫిక్ పోలీసుల బూత్కు తీసుకెళ్లి బాలికపై మరోసారి లైంగిక దాడి చేశాడు.రామన్ నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలిక ఇంటికి చేరింది.
అయితే తనకు ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న బాలిక ఇంటి నుంచి మళ్లీ పారిపోయింది బాలిక. ఈసారి తన బాయిఫ్రెండ్ను కలిసింది. ఇద్దరు కలిసి ఒక చోట సహజీవనం మొదలు పెట్టారు.
ఇంతలో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టారు. బాలికను విచారించగా ట్రాఫిక్ పోలీసు రామన్ బాగోతం బయటపడింది. దీనికి తోడు బాయ్ఫ్రెండ్ కూడా తనపై లైంగికదాడి చేశాడని బాలిక పోలీసులకు తెలిపింది.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





