SGSTV NEWS online
Telangana

అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు:*

*అందెశ్రీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం పలు సంఘాల నాయకులు వెల్లడి*

మాసాయిపేట మెదక్ నవంబర్ 10

తెలంగాణ రాష్ట్ర కవి, ఉద్యమకారుడు, సాహితీవేత్త అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు అని అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చిన్నరాం లక్ష్మణ్ పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు యాదగిరి మాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఆయన ఆకస్మిక మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని
తెలంగాణ సాహితీ లోకంలో ఒక మహానుభావుడిని, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కవిని కోల్పోయామని అన్నారు.
“జయ జయహే తెలంగాణ” పాట ద్వారా తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేసిన అందెశ్రీ గారి సేవలు మరువలేనివి. రాష్ట్ర అవతరణలో ఆయన పాత్ర అత్యంత కీలకమైంది,” అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు యాదగిరి మాదిగ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,
ఆయన కుటుంబ సభ్యులకు రజక సంఘం గుల్లపల్లి బాబు అంజనీపుత్ర యూత్ అసోసియేషన్ గుడ్డి చిన్న రమేష్ తదితరులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు

Also Read

Related posts